Tuesday, December 27, 2011

ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

  • కనీస మద్దతు ధర కాగితాలకే పరిమితం
  • అమలుకు నోచని జీఓ మూడు
  • సక్రమంగా వినియోగించని సబ్‌ ప్లాన్‌ నిధులు
  • మద్యం ముడుపుదారులను వెల్లడించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ తీర్మానం
           రాష్ట్రంలో నెలకొన్న కరువు, విద్యుత్‌ కోతలు తదితర ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం విమర్శించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
                   రాష్ట్ర ముఖ్యమంత్రి, పాలకవర్గం పదవులు కాపాడుకోవడమే పరమావధిగా పనిచేస్తూ, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో 876 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 52 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే రూ.4,500 కోట్ల విలువైన పంటలకు నష్టం జరిగింది. రుణగ్రస్తులైన రైతులు గత రెండు మాసాల్లోనే 250 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వ సాయం అందలేదు. ప్రస్తుతం మార్కెట్లలో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు అమలుకావటం లేదు. క్వింటాలు రూ.1,110 అమ్మాల్సిన ధాన్యాన్ని రూ.800-900 మధ్య వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం, పత్తి, పసుపు పంటల ధరలు పూర్తిగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధరలకే కొనుగోలు చేస్తామంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆర్భాటంగా చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్లు జరపడం లేదు. జలయజ్ఞం కాంట్రాక్టర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే పనులు నిలిపేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోంది.

Sunday, December 25, 2011

క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు....

  సోదరసోదరీమణులందరికీ
హృదయపూర్వక క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు...

Saturday, December 24, 2011

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
జనవరి 28 నుంచి ....
            పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ షెడ్యూలు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లోను, మిగిలిన చోట్ల ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్‌లోని 60 స్థానాలకు జనవరి 28వ తేదీన, పంజాబ్‌లోని 117 స్థానాలకు, ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలకు జనవరి 30న, గోవాలోని 40 స్థానాలకు మార్చి 3వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. 
           ఉత్తరప్రదేశ్‌లోని 403 నియోజకవర్గాలకు గాను ఫిబ్రవరి 4, 8, 11, 15, 19, 23, 28వ తేదీల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కాగా, ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వస్తుందని, ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, అభ్యర్థులు గుర్తుంచుకోవాలని ఖురేషీ సూచించారు.
 
 ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..... 

Friday, December 23, 2011

నిరుద్యోగం....నిరుద్యోగం....

  • ప్రపంచ దేశాల ప్రధాన ఆందోళన ఇదే
  • అవినీతి, పేదరికమూ చర్చనీయాంశాలే
  • బిబిసి సర్వేలో వెల్లడి
              ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఆందో ళన చెందుతున్న సమస్య ఏది? ఈ ప్రశ్నకు జవాబు 'నిరుద్యోగం'. నిరుద్యోగ సమస్యపై అన్ని దేశాల్లోనూ ఆందోళన పెరుగుతున్నట్లు 23 దేశాల్లోని 11 వేల మంది పై బిబిసి వరల్డ్‌ సర్వీస్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. వరల్డ్‌ స్పీక్స్‌(ప్రపంచం మాట్లాడుతుంది) అనే పేరిట బిబిసి మూడే ళ్ళుగా ఈ సర్వే జరుపుతోంది. అందులో ప్రజలకు కొన్ని ఆందోళనకారకమైన అంశాల జాబితాను ఇచ్చి, అందులో వారు తమ మిత్రులు, కుటుంబ సభ్యులతో గత నెలలో చర్చించిన అంశాల గురించి చెప్పాల్సిందిగా కోరారు. అవినీతి, పేదరికం కూడా అత్యధికంగా ఆందోళన కలిగించే సమస్యలే అయినా నిరుద్యోగం ప్రధానాంశంగా ఉంది. 2009లో జరిపిన మొట్టమొదటి సర్వేలో కంటే ఈసారి ఆరు రెట్లు అధికంగా 18 శాతంగా ఉంది. ఈ పోల్‌ను గ్లోబ్‌స్కాన్‌ నిర్వహించింది. సర్వే చేసిన దాదాపు అన్ని దేశాల్లోనూ నిరుద్యోగానికి సంబంధించిన ఆందోళన పెరుగుతున్నట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా అవినీతి కూడా ఎక్కువగా చర్చనీయాంశమైన అంశంగా ఉన్నప్పటికీ నిరుద్యోగమే ప్రధాన ఆందోళనగా ఉంది. ప్రశ్నించినవారిలో దాదాపు నాలుగో వంతు మంది గత నాలుగు వారాల్లో అవినీతిని గురించి ఎక్కువగా చర్చించినట్లు వెల్లడైంది. తరువాత స్థానంలో పేదరికం ఉంది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇటీవలి కాలంలో దీన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. నిరుద్యోగానికి సంబంధించిన ఆందోళన విషయంలో ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య తేడాలున్నాయి. స్పెయిన్‌ ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ దాదాపు 54 శాతం మంది దాన్ని గురించి తరచుగా చర్చించుకున్నట్లు చెప్పారు. గత బిబిసి సర్వే కంటే ఇది మూడింట ఒక వంతు ఎక్కువకు పెరిగింది. స్పెయిన్‌ యూరో ప్రాంతంలోని రుణ సంక్షోభానికి కేంద్ర స్థానంలో ఉంది. ఇంకా అక్కడ నిరుద్యోగిత ఆ ప్రాంతంలోనే అత్యధికంగా 40 శాతానికి పైగా ఉంది. ఘనా, మెక్సికో, నైజీరియా, టర్కీలో కూడా ప్రధాన చర్చనీయాంశంగా నిరుద్యోగం ఉంది.
                          అమెరికా పెట్టుబడి బ్యాంకు లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిన సమయంలో మొదటి వార్షిక సర్వే 2009లో ప్రచురితమైంది. 2009 నుంచి జరిపిన ప్రతి సర్వేలోనూ ఈ మూడు సమస్యలూ మొదటి స్థానాల్లోనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. దానికి భిన్నంగా నైజీరియా, భారతదేశం, టర్కీ, ఇండోనేషియా, పెరూలో అవినీతి ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇంకా చైనా, రష్యా, కెన్యా, ఫిలిప్పైన్స్‌లో ఆహారం, ఇంధన ధరల పెరుగుదల ప్రధానాంశంగా ఉంది. లాటిన్‌ అమెరికాలో నేరాలు, హింస సాధారణంగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ సర్వేను ఈ సంవత్సరం జులై, సెప్టెంబర్‌ మధ్య కాలంలో నిర్వహించారు.     
                             ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

Monday, December 19, 2011

ఈ రోడ్లు చూశారా...!

ఈ రోడ్లు చూశారా...!
ఎంతో అద్భతంగా వున్నాయి. ఉత్సహాన్ని, భయాన్ని కల్గించే విధంగా ఉన్న రోడ్లు మీరు ఏపుడైన చూశారా !


లేకపోతే ఒక సారి చూడండి.









Saturday, December 17, 2011

ఈ తరం ముందున్న సవాళ్లు...

           ప్రపంచ సంపదను జనాభాలో కేవలం 15 శాతంగా వున్న సంపన్నులే అనుభవిస్తుంటే, మిగతా 85 శాతం మంది అల్లాడుతున్నారు. ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయాయి. భూమండలమే ప్రమాదం అంచుకు చేరుకోబోతోంది. ప్రకృతిని సంపన్న దేశాలు తమ అవసరానికన్నా మించి వాడుకుని భూగోళం ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టాయి.
                ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకుని కునారిల్లుతున్నాయి. విద్యార్థులు, యువకులే కాదు వికలాంగులు కూడా వారి కుటుంబాలతో కలిసి ఈ ఆర్థిక సంక్షోభాల నేపథ్యాన్ని వివరిస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రదర్శనలు చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, కాంట్రాక్టు సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం కార్మిక లోకం దీక్షలు చేస్తున్నది. న్యూయార్క్‌లోపి యూనివర్సిటీల నుంచి ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం ప్రపంచమంతటా పాకింది. పాలక పీఠాలపై కూర్చున్న పెద్దలు బలప్రయోగంతో అణచివేయాలని చూస్తుంటే, ప్రజాఉద్యమాలు వారి కుర్చీలనే కుదిపేస్తున్నాయి. 21 వ శతాబ్దంలో ఊహించలేనంత జ్ఞానం ఉత్పత్తి అయ్యింది. ఉపాధి అవకాశాలు అన్ని రంగాల్లోనూ పెరిగాయి. అయినా ఈ ఆందోళనలు రావడం పాలక వర్గ పార్టీలకు దడ పుట్టిస్తున్నది. కారణమేమిటని పరిశీలించినప్పుడు రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. 1.ప్రపంచ సంపదను జనాభాలో కేవలం 15 శాతంగా వున్న సంపన్నులే అనుభవిస్తుంటే, మిగతా 85 శాతం మంది అల్లాడుతున్నారు. ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయాయి. 2. భూమండలమే ప్రమాదం అంచుకు చేరుకోబోతోంది. ప్రకృతిని సంపన్న దేశాలు తమ అవసరానికన్నా మించి వాడుకుని భూగోళం ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టాయి. రుతువులు గతి తప్పాయి. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆహార భద్రత సమస్య కూడా తలెత్తుతోంది. ఒక వైపున పెరిగిపోతున్న అసమానతలు, మరో వైపున హక్కుల హరణం, నాగరికతల నాశనం చేసే ఎత్తుగడలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. చివరకు పార్లమెంటులో కూడా గుద్దులాటలు, డబ్బు సంచులు పంచుకోవటాలు, ఘర్షణలు, ఒకరిపై ఒకరు దాడిచేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామిక వ్యవస్థకు ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఇవన్నీ వాల్‌స్ట్రీట్‌ ఉద్యమానికి హేతువులే.

Wednesday, December 14, 2011

సోషలిజమే ప్రత్యామ్నాయం.

           సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరోపియన్‌ దేశాల్లో సోషలిస్ట్‌ వ్యవస్థ పతనమై ఇరవై సంవత్సరాలైంది. సోషలిస్టు వ్యవస్థ కూలిపోవడంపై చంకలు గుద్దుకున్న పెట్టుబడిదారీ ప్రపంచం, మరీ ముఖ్యంగా సామ్రాజ్యవాద శక్తులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సోషలిస్ట్‌ శిబిరంలో ఉపద్రవం నెలకొన్న దశాబ్దానికే పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేని సంక్షోభంలో పడిపోయింది. ప్రస్తుత సహస్రాబ్ధి ఆరంభం నుండి సంక్షోభాన్ని చవిచూస్తున్న పెట్టుబడివారీ వ్యవస్థ ఈ సుడిగుండంలోంచి ఎలా బయటపడాలో తెలియక దిక్కులు చూస్తోంది. పెట్టుబడిదారీ అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు క్రమంగా పతనమవుతున్నది. నిరుద్యోగం పెరిగిపోతున్నది. మార్కెట్‌ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. షేర్‌ మార్కెట్‌ కుప్పకూలింది. భారీ ఆర్థిక సంస్థలు కూడా పేకమేడలా ఒకటి తరువాత ఒకటి కూలుతున్నాయి. ప్రస్తుత శతాబ్దం మొదటి దశాబ్దంలో అంటే 2008 సెప్టెంబరు మధ్యలో తలెత్తిన ఈ సంక్షోభం 1930 నాటి మహా మాంద్యాన్ని తలపింపచేస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదని వాదించిన వారు నేడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన స్థితిలో పడ్డారు. ఇందుకు భిన్నమైన పరిస్థితి సోషలిస్టు శిబిరంలో నెలకొంది. సోషలిస్టు వ్యవస్థ తిరిగి మరింత బలంగా పుంజుకుంటున్నది. సోషలిస్టు వ్యవస్థ పతనమైన గడ్డపైనే కమ్యూనిస్టులు గణనీయమైన శక్తిగా తిరిగి ఎదుగుతున్నారు. చైనా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వేగవంతమైన పురోభివృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదగగలదని భావిస్తున్నారు. సోషలిస్టు క్యూబా ప్రపంచంలో అతి పెద్ద సైనిక, ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రశంసనీయమైన అభివృద్ధి రేటును సాధించింది. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో వామపక్ష భావాలు గల పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి.

Tuesday, December 13, 2011

భవిష్యత్తు సోషలిజానిదే... !

  • ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి
  • కేపిటలిజం దుర్మార్గానికి తెర దించాలి
  • కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ మహాసభ ప్రకటన
            పెట్టుబడిదారీ వ్యవస్థ తాత్కాలికంగా ఆధిపత్యం కొనసాగించినా అంతిమంగా భవిష్యత్తు సోషలిజానిదేనని ఇక్కడ ముగిసిన కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ మహాసభ ఉద్ఘాటించింది. ఈ నెల 9-11 తేదీల మధ్య ఏథెన్స్‌లో జరిగిన ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల నుండి 78 పార్టీలకు చెందిన దాదాపు 400 మందికి పైగా ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ మహాసభల్లో పాల్గొనలేకపోయిన దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ సందేశాలను పంపాయి. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత గత 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎదుర్కొన్న అనుభవాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ప్రధానంగా చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధాల వంటి పరిణామాలు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానుకూల అంతర్జాతీయతా వాదాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమిని బలోపేతం చేయటం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి సామ్యవాద వ్యవస్థను నిర్మించాలని ఈ మహాసభలు తమ తుది ప్రకటనలో పిలుపునిచ్చాయి. 2008లో సావోపౌలో (బ్రెజిల్‌), 2009లో న్యూఢిల్లీ (భారత్‌), 2010లో ష్వేన్‌ (దక్షిణాఫ్రికా)లలో జరిగిన 10, 11, 12 వ అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల మహాసభలు విశ్లేషించి జారీ చేసిన ప్రకటనల్లోని అంశాలను ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయని ఈ మహాసభలు తమ ప్రకటనలో వివరించాయి.

Monday, December 12, 2011

సహజ కవి '' మల్లెమాల '' ఇకా లేరు...

ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ సినీనిర్మాత... మల్లెమాల గారు ఇకా లేరు. సినిమా రంగంలో 'మల్లెమాల'గా సుపరిచితులైన  ఎమ్మెస్‌ రెడ్డి (87).  ఆయన పూర్తిపేరు మల్లె మాల సుందరరామిరెడ్డి
                సమాజంలోని అన్యాయాలను, దురాగతాలను చూపి చలించిపోయిన మానవతా మూర్తి. అద్భుతమైన పాటలను సినమాలకు, తెలుగు సాహితీ ప్రపంచానికి అందించారు. అదే సమయంలో సామాజిక స్ప ృహతో విప్లవ గీతాలు, కవితలు రచించారు.         
                 స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీజి ప్రసంగానికి ప్రభావితుడై, వారిని కలిసి ఆయన బాటలో అంటారాని తనాన్ని నిమ్ములించాలని అహర్నిశలు కృషి చేశారు. సమతా, మమతల బావనతో ఎన్నో కవితలను రచించారు. పశ్చిమబెంగాల్‌ కరువు వచ్చినపుడు 'కష్టజీవి' బుర్రకథని తోటివారితో కలిసి ప్రదర్శించి వచ్చిన డబ్బులను బెంగాల్‌ పంపినారు. ఎనో సినిమాలను రూపొందించారు. 'అంకుశం' సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో సహజ నటనతో కనిపించారు.            
          సహజ కవి, ఆంధ్రా వాల్మీకి, అభినవ వేమన...బిరుదులు, జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
                'మల్లెమాల' రాలిపోయింది. సుమధుర గీతం ఆగిపోయింది.

Sunday, December 11, 2011

మిత్రులకు, బంధువులకు తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు ....

హాలో ఫ్రెండ్‌..
తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు ....
ఈ బీజి ప్రపంచంలో ఏవరి పని వారికి. ఏవరి బీజి వారికి ఉంటుంది. తెలుగు వారి కోసం పది నిముషాలు కెటాయిస్తే మనకు తెలిసి ఒక మంచి విషయాన్ని పది మందికి తెలియజేసిన వారిగా, వారికి సహాయాన్ని, సహకారాన్ని అందిందిచన వారం అవుతాం. నేటికి తెలుగులో దాదాపు 4500 బ్లాగులు మాత్రమే ప్రపంచంలో వున్నాయని తెలుసు. అంటే దీనిని బట్టి తెలుగు పరిస్థితి అర్ధం అవుతుంది. నేను చిన్న ప్రయత్నంగా మిత్రులకు, బంధువులకు తెలియజేసి, ప్రోత్సహించి కొన్ని బ్లాగులను ప్రారంభింపజేశాను.
మనం మన వంతుగా కృషిగా విలైనపుడు మాతృభాష అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వ్యాప్తికి కృషి చేద్దాం...

మరో సారి తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలతో   ....

( నేడు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా...)

Thursday, December 8, 2011

'' వీరు'' విజయవిహారం.....

7 సిక్స్‌, 25 ఫోర్స్‌ 219 పరుగులతో సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ చేశారు.


వన్డేలలో ప్రపంచ రికార్డులను నేలకోల్పిన సెహ్వాగ్‌
వన్డేలలో భారత్‌ అత్యధిక స్కోరు 418.
200 స్కోరు దాటిన వారిలో భారత్‌లో సెహ్వాగ్‌ 219, సచిన్‌ 200
400 ల మైలురాయిని ఇప్పటి వరకు కేవలం 4 సార్లు మాత్రమే దాటిన భారత్‌.
కెప్టెన్‌గా డబుల్‌ సెంచరీ వన్డేలలో ప్రపంచ రికార్డులను నేలకోల్పిన సెహ్వాగ్‌
 
సెహ్వాగ్‌ దుకుడుకు పోకుండా, తన నిజస్వరూపం ప్రదర్శిస్తున్నారు.
మధ్యమద్యలో చిరునవ్వులతో...సెహ్వాగ్‌ కనపడుతూ, పరుగుల వరదను కురిపిస్తున్నారు. 
                  
                   భారత్‌ విజయం కాయం.

వన్డే సిరిస్‌ విజయం దిశలో భారత్‌......


వీరు విజయవిహారం.....5 సిక్స్‌, 16 ఫోర్స్‌ తో 160 పరుగులతో నడిపిస్తున్నారు.( నాటౌవుట్‌). రైనా 38 పరుగులతోఆడుతున్నారు.
176 పరుగుల వద్ద తొలివికేట్‌ కోల్పొయింది. గంబీర్‌ 67 పరుగుల వద్ద ఔటయ్యారు. సహ్వాగ్‌ సెంచరీ చేశారు. ఇది వన్డేలలో 15వ సెంచరీ. సహ్వాగ్‌ విజయ విహారం నేడు మరల కనబడుతున్నది. సెహ్వాగ్‌ తన నిజస్వరూపం ప్రదర్శిస్తున్నారు. భారత్‌ విజయం కాయం.
భారత్‌ 36 ఓవర్స్‌లో 276 పరుగులతో...ఆడుతున్నారు. వెస్టిండీస్‌తో ఇండోర్‌లో జరుగుతున్న నాలుగవ వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.
భారత్‌ విజయాన్ని కోరుతూ...

Wednesday, December 7, 2011

నిలుపుదల కాదు... రద్దు చేయాల్సిందే - ప్రకాశ్‌ కరత్‌

  • ఒక్క ఉద్యోగమొస్తే 17 పోతాయి
  • ప్రభుత్వం దిగొచ్చేదాక పోరాడతాం
  • రిటైల్‌ ఎఫ్‌డిఐపై ప్రకాష్‌ కరత్‌
  • బుక్‌లెట్‌ విడుదల
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినివ్వాలన్న నిర్ణయాన్ని యుపిఎ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ' రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలకు అనుమతినివ్వాలన్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇది ఒక పన్నాగం మాత్రమే. పార్లమెంటు శీతకాల సమావేశాలు ముగిసేదాకా నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 పూర్తవుతోంది కాబట్టి..2012లో తిరిగి నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనికి సిపిఎం అంగీకరించదు. రిటైల్‌లో ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని నిలుపుదల చేయడం కాదు పూర్తిగా రద్దు చేయాలి ' అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులతో జరిగే నష్టాలను వివరిస్తూ పార్టీ రూపొందించిన బుక్‌లెట్‌ను మంగళవారమిక్కడ ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాటాడుతూ 2005లో యుపిఎ ప్రభుత్వం తొలిసారి ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటి నుండీ తాము స్థిరంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ' నిలుపుదల పేరుతో ప్రతిపక్షాలను, ప్రజలను మాయ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తే అది సరికాదు. కోట్లాది ప్రజల ఉపాధికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకునే వరకూ మా పోరాటం కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా భావసారూప్య శక్తులన్నింటినీ కూడగట్టి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతాం ' అని ఆయన అన్నారు. 

Tuesday, December 6, 2011

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అశయ సాధనకు కృషి ఎక్కడ.......

భారత రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్య్రోద్యమ నాయకులు, భారత తొలి న్యాయ శాఖా మంత్రి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం కృషి ఎక్కడ వుంది. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆశాలను తుంగలో తొక్కుతున్నాయి. నాయకుల వర్ధంతులు, జయంతుల సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి గణంగా నిర్వహించాము అని చెపుకోవడానికి మాత్రమే సరిపోతున్నది. ట్యాంక్‌బండ్‌ క్రింద వున్న డా|| అంబేద్కర్‌ భవన్‌లో గత కొంత కాలంగా కరెంటు లేక చీకటిమయంగా వుంది.  దాని ఆలన, పాలన చూస్తే నాదుడు లేడు. సాంఘీక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఏ.పి.స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుండి దాదాపు 400 మంది ఐఏఎస్‌,ఐపిఎస్‌ తదితర.....అధికారులను ఇచ్చిన ఘనత ఈ స్టడీ సర్కిల్‌కు వుంది. ఇపుడు ప్రభుత్వం పట్టిచుకోక నిధుల కొరతతో త్రీవ సంక్షోభంలో వుంది. శిక్షణ కార్యక్రమాలు జరగడం లేదు. ఇకా మూతపడే దశకు చేరుకుంది. దళితులకు, బలహీన వర్గాలకు, పేదల అభివృద్ధికి, ప్రజ సంక్షేమము కోసం కృషి చేస్తున్నాము అని చేపుకొనే నాయకులకు ఇవ్వన్ని కనబడవా ?
 
                   ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలె. దేశంలో,  మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఈ పాశవిక సంఘటనలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా, పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు.  శ్రీకాకుళం జిల్లా దళతున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు  ఒక తండ్రి.
                అంబేద్కర్ ఆలోచనలు ఈనాడు ఎంతగా వ్యాపించినా, బలపడినా - దేశంలో ఇంకా దళితులపై అత్యాచారాలు, హత్యలు  జరుగుతూనే ఉన్నాయి,   దళితులు,  బలహీన వర్గాలు  అవమానాలకు గురి అవుతున్నారు. దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతున్నది.
               అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా  ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా  ముందుకు  రావాలని  కొరుకుంద్దాం.        
డాక్టర్‌ భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌ గారు 1956 డిసెంబర్‌ 6న మరణించారు.
                             ( నేడు ఆయన వర్ధంతి సందర్భంగా...) 

Thursday, December 1, 2011

'రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐ' అంశంపై బుక్‌లెట్‌ విడుదల- రాఘవులు

'రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐ' అంశంపై సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన బుక్‌లెట్‌ను  రాష్ట్ర కార్యదర్శ రాఘవులు ఆవిష్కరించారు. ఎఫ్‌డిఐలను ప్రవేశపెట్టిన దేశాల్లో వీటి ద్వారా వంద మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తే వెయ్యి మంది ఉద్యోగాలు కోల్పోయిన దాఖలాలు న్నాయని, ఆగేయాసియా దేశాల్లో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. వాల్‌మార్ట్‌ వచ్చిన తర్వాత అమెరికాలోనూ ఇదే స్థితి నెలకొందన్నారు. అక్కడ వాల్‌మార్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఎఫ్‌డిఐలను అనుమతించటం వల్ల దేశంలో ధరలు తగ్గుతాయని ప్రధాని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగాయనే సాకుతో దేశంలో ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారని, అయితే అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ ధరలు తగ్గించలేదని విమర్శించారు. ఎరువులు, పెట్రోల్‌ ధరలపై నియంత్రణ ఎత్తేయటమే దీనికి కారణమన్నారు. 
              ఎఫ్‌డిఐల వల్ల దేశీయ మార్కెట్‌లోకి 70 శాతం విదేశీ వస్తువులు వచ్చిపడితే మన దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వస్తువుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి దెబ్బతినిపోయినప్పటికీ కొద్దిమంది వినియోగదారులకు చౌక ధరలకే వస్తువులను అందిస్తామని చెప్పటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. ఎఫ్‌డిఐలు అమల్లోకి వచ్చిన తర్వాత విదేశీ షాపులను ప్రతిఘటిస్తామని, ఈ అంశంపై మిగతా అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం వ్యాపారులు నిర్వహించ తలపెట్టిన బంద్‌లో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు.

Wednesday, November 30, 2011

తెలుగు సాహితీ జగత్తులో ఒక ధృవతార ....

      తెలుగు సాహితీవేత్తల్లో అగ్రగణ్యులు గురజాడ వెంకట అప్పారావు. అభ్యుదయ సాహిత్యాన్ని సృజించి, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న మహౌన్నతుడు. సాహిత్యమనేది సామాజిక అభ్యున్నతికి, సంఘ సంస్కరణకు దోహదపడాలన్న ఉదాత్త ఆశయం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సామాజిక దురాగతాలపై పోరాటమే సాహిత్యం లక్ష్యమని ప్రగాడంగా విశ్వసించిన నవయుగ వైతాళికుడు.
'' దేశమంటే మట్టికాదోయి
... దేశమంటే మనుషులోయి '' అంటూ సమాజానికి చాటి చెప్పినారు. సంఘ సంస్కరణ కోసం కలం పట్టారు. ప్రధానంగా అంశాలుగా స్త్రీ జనోద్ధరణ, మూడనమ్మకాలు ఎంచుకోన్నారు. ఆయన సంఘసంస్కర్త. చదువు వల్ల సమకూర్చుకున్న విజ్ఞానాన్ని జనులకు పంచిపెట్టేవారు.
            కన్యాశుల్కం నాటకం చాలా అద్భుతం. వాస్తవిక జీవితం నుండి సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు వాడుక బాషలో 1892 లో కన్యాశుల్కం నాటకాన్ని రాశారు. వేలలాది ప్రదర్శనలిచ్చిన ఇచ్చారు. వందల సంవత్సరాలు దాటినా విశేష జనాదరణ పొందుతున్న నాటకం కన్యాశుల్కం. జాతీయ భాషల్లోనే కాకుండా ఇతరల దేశాల బాషల్లో కూడా అనువదితమైంది. ఆనాటి సమాజంలో బాల్యవివాహలే ప్రధాన ప్రేరణ. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్ళి పేరిట అమ్ముకోవటాన్ని గురజాడ తీవ్రంగా నిరసించారు.
                  గురజాడ కలం నుంచి రచనలు ఎన్నో... ఆయన రచించిన దేశభక్తి గేయాలు అందరికి నవ ఉత్తేజాన్ని నింపాయి. ప్రగతిశీల భావాలు కలిగిన అభ్యుదయ రచయితలకు, వ్యక్తులకు కాదు అందరికి ఉత్సహన్ని ఇచ్చాయి. సామాజిక దురాచారాలను నిరసిస్తూ నైతిక ప్రమాణాల వ్యాప్తి చేయటంమే సాహిత్య కర్తవ్యం అని విశ్వసించినవారు.వారి రచనలు స్ఫూర్తిదాయకం.
                   గురజాడ వెంకట అప్పారావు రాయవరం గ్రామం, ఎలమంచిలి తాలూకా, విశాఖపట్నం జిల్లా లో 1862 సెప్టెంబర్‌ 21 జన్మించారు.
ఆయన కలం అలసి సొలసి పోయి 
ఆయన 97వ సం||లో  1915 నవంబర్‌ 30న కన్ను మూశారు. 
( నేడు వారి వర్థంతి సందర్భంగా....) 

Friday, November 25, 2011

సచిన్‌ సెంచరీల '' సెంచరీ '' ఏపుడూ....?

                ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ మిస్ చేశారు. వందో శతకానికి ఆరు పరుగుల దూరంలో సచిన్ ఔట్ అయ్యారు.  సెంచరీ మిస్ చేసుకోవడం సచిన్‌కిది 16 వ సారి. 
              ఇంకా ఈ టెస్టులో భారత్‌కు మళ్ళీ ఇన్నింగ్స్‌ రావడం, మరల సచిన్‌ సెంచరీ చేయడం చాల కష్టమే. వచ్చే నెలలో జరుగనున్న మూడు వన్డేలకు సచిన్‌ కు విశ్రాంతి ఇచ్చారు. కాబట్టి  ఈ మధ్యకాలంలో సెంచరీల '' సెంచరీ '' లేదు.
               వెస్టిండీస్‌తో జరుగు మూడు ఒన్డేలకు భారత్ జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతి ఇస్తూ, కెప్టెన్‌గా వీరేంద్రసెహ్వాగ్‌ను ఎంపిక చేస్తూ చేసింది.
               వీరేంద్రసెహ్వాగ్‌ ( కెప్టెన్‌ ), గౌతమ్ గంభీర్, కోహ్లీ, పటేల్, మనోజ్ తివారీ, రైనా, ఉమేష్ యాదవ్, రాహుల్ శర్మ, ప్రవీణ్ కుమార్, జడేజా, రహానే, వరుణ్, రోహిత్‌శర్మ, వినయ్‌కుమార్ తదితరులను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా ఈ వన్డేలకు యువరాజ్, హర్భజన్‌సింగ్‌ను దూరంగా ఉంచింది.


నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం పెరగడానికా...?

    చిల్లర వ్యాపార రంగం (రిటైల్‌)లోకి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ గురువారం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల శాఖ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఆయన నేతృత్వంలోనే జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదముద్ర వేసింది.  సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లోకి వంద శాతం, మల్టీబ్రాండ్‌ రిటైల్‌లోకి 51 శాతం ఎఫ్‌డిఐలకు అనుమతిస్తారు. దీంతో ప్రపంచ బడా రిటైల్‌ మార్కెట్లు   మన దేశ చిల్లర వ్యాపారంలో పెత్తనం చెలాయించేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో మాత్రమే 51 శాతం ఎఫ్‌డిఐలకు అనుమతివుంది. మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో అసలు లేదు.

             మార్కెట్‌ గుత్తాధిపత్యం వల్ల వినియోగదారుల ప్రయోజనాలకు హానికరము. దేశ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. వినియోగదాలు, చిల్లర వర్తకం దారులు చాలా నష్టపోతారు. సంప్రదాయకంగా చిల్లర వర్తకం మీద ఆధారపడిన కుటుంబాలు వీదిన పడతాయి.
              దేశవ్యాప్తంగా దాదాపు 1.2 కోట్ల షాపుల్లో దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటిలో 95 శాతానికి పైగా షాపులు కేవలం 500 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో స్వయం ఉపాధి కల్పించుకున్న వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ రంగంలో ఎంఎన్‌సిల ప్రవేశం ద్వారా వీరంతా దెబ్బతింటారు. సూపర్‌ మార్కెట్లు ఏర్పాటైన ప్రతి చోటా చిన్న వ్యాపారులు రోడ్ల పాలైన విషయాన్ని అంతర్జాతీయ అనుభవాలు మన కళ్లకు కడుతూనే ఉన్నాయి.                 
                మన దేశానికి, మాన ప్రజలకు నష్టం తేచ్చే దానిని వ్యతిరేకిద్దాం.