ప్రపంచ సంపదను జనాభాలో కేవలం 15 శాతంగా వున్న సంపన్నులే అనుభవిస్తుంటే, మిగతా 85 శాతం మంది అల్లాడుతున్నారు. ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయాయి. భూమండలమే ప్రమాదం అంచుకు చేరుకోబోతోంది. ప్రకృతిని సంపన్న దేశాలు తమ అవసరానికన్నా మించి వాడుకుని భూగోళం ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టాయి.
ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకుని కునారిల్లుతున్నాయి. విద్యార్థులు, యువకులే కాదు వికలాంగులు కూడా వారి కుటుంబాలతో కలిసి ఈ ఆర్థిక సంక్షోభాల నేపథ్యాన్ని వివరిస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రదర్శనలు చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, కాంట్రాక్టు సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం కార్మిక లోకం దీక్షలు చేస్తున్నది. న్యూయార్క్‌లోపి యూనివర్సిటీల నుంచి ప్రారంభమైన వాల్‌స్ట్రీట్ ఉద్యమం ప్రపంచమంతటా పాకింది. పాలక పీఠాలపై కూర్చున్న పెద్దలు బలప్రయోగంతో అణచివేయాలని చూస్తుంటే, ప్రజాఉద్యమాలు వారి కుర్చీలనే కుదిపేస్తున్నాయి. 21 వ శతాబ్దంలో ఊహించలేనంత జ్ఞానం ఉత్పత్తి అయ్యింది. ఉపాధి అవకాశాలు అన్ని రంగాల్లోనూ పెరిగాయి. అయినా ఈ ఆందోళనలు రావడం పాలక వర్గ పార్టీలకు దడ పుట్టిస్తున్నది. కారణమేమిటని పరిశీలించినప్పుడు రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. 1.ప్రపంచ సంపదను జనాభాలో కేవలం 15 శాతంగా వున్న సంపన్నులే అనుభవిస్తుంటే, మిగతా 85 శాతం మంది అల్లాడుతున్నారు. ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయాయి. 2. భూమండలమే ప్రమాదం అంచుకు చేరుకోబోతోంది. ప్రకృతిని సంపన్న దేశాలు తమ అవసరానికన్నా మించి వాడుకుని భూగోళం ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టాయి. రుతువులు గతి తప్పాయి. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆహార భద్రత సమస్య కూడా తలెత్తుతోంది. ఒక వైపున పెరిగిపోతున్న అసమానతలు, మరో వైపున హక్కుల హరణం, నాగరికతల నాశనం చేసే ఎత్తుగడలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. చివరకు పార్లమెంటులో కూడా గుద్దులాటలు, డబ్బు సంచులు పంచుకోవటాలు, ఘర్షణలు, ఒకరిపై ఒకరు దాడిచేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామిక వ్యవస్థకు ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఇవన్నీ వాల్‌స్ట్రీట్ ఉద్యమానికి హేతువులే.
21వ శతాబ్దంలో సమాచార విప్లవం దూసుకొచ్చింది. ప్రపంచాన్నే ఈ సమాచార విప్లవం ఒక దగ్గరకు తీసుకువస్తుందని, అన్ని దేశాలను సుభిక్షం చేస్తుందని తొలుత ప్రచారం చేశారు. దీనికి భిన్నంగా ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలపై పశ్చిమ దేశాల దాడులు మొదలయ్యాయి. ఇదివరకు భూఖండాలను ఆక్రమించేవారు. ఇప్పుడు మార్కెట్‌ను ఆక్రమించి, సామాజిక జీవితాలను ఛిద్రం చేసి సాంస్కృతిక ఆధిపత్యాన్ని రుద్దుతున్నారు. గడచిన వందేళ్లలో ఉత్పత్తి విధానాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. ఇదివరకు క్యాపిటల్ ఫ్లో ఉండేది. నేడది మార్కెట్టే ఫ్లో గా మారిపోయింది. లేబర్ స్థితిగతులు దినదినం క్షీణిస్తున్నాయి. ఇవాళ యూరప్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనుకుంటే తెల్లారేసరికి అవి ఇండియాకు వస్తాయి. ఆ ఆనందం ఎంతో సేపు కూడా ఉండదు. ఇంతలోనే అవి ఆస్ట్రేలియాకు తుర్రుమంటాయి.
ఉద్యోగ భద్రత నేడు ప్రపంచ సమస్యగా మారిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఆ రంగం ఈ రంగం అని లేదు. అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. చివరకు జీవితమే కాంట్రాక్ట్‌గా మారిపోయింది. వినియోగదారుడు ఒక ఆటవస్తువుగా మారిపోయాడు. అతనితో మార్కెట్ వ్యవస్థ ఆడుకుంటోంది. ప్రజల సంపదను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించడమే పాలనా యంత్రాంగం పని అయిపోయింది. ప్రజాస్వామిక ముసుగులో పాలనా యంత్రాంగాన్ని తమ చెప్పుతచేతల్లో పెట్టుకుని ప్రజా ధనాన్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ప్రజలపైకి చిల్లర పైసలు విసిరినట్లు సంక్షేమ కార్యక్రమాలను విదిలిస్తున్నారు. ఆ విధంగా తమ కుర్చీలను భద్రపరుచుకోవాలని చూస్తున్నారు. విలువలులేని పరిపాలనా ధర్మాలు వంటబట్టించుకున్న నాయకులు అవతరిస్తున్నారు. వీరే ప్రపంచీకరణ విధానాలను ముందుకు తెస్తున్నారు. ప్రపంచీకరణ వల్ల కొత్త గ్లోబల్ అంగళ్లు వచ్చాయి. తళ తళ మెరిసే ఎయిర్ పోర్టులు వచ్చాయి. కొత్త దుకాణాలు, విశాలమైన మార్కెట్ మాల్స్ వచ్చాయి. కానీ, 50శాతం దాకా ఉన్న పేద జనానికి ఇవి తీరని కడగండ్లు మిగిల్చాయి. ఆర్థిక అసమానతలు అనేక రెట్లు పెరిగాయి. ఆర్థిక రాజకీయ చట్రాలను చిన్నాభిన్నం చేసి దోపిడీని తీవ్రతరం చేశాయి. ఇది చాలదని ప్రకృతిని కూడా విషపూరితం చేస్తున్నాయి. గతంలో 10 శాతం కంటే ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చేది కాదు. ఈనాడు అది 40 శాతానికి పెరిగింది. రసాయనిక ఎరువుల అధిక వినియోగం, భూ ఉష్ణోగ్రతలు పెరిగి ఓజోన్ పొర కరిగిపోతుండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ శక్తులు తమ లాభాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల వల్ల విద్యుత్ కొరత, ఆహార కొరత, ఆర్థిక సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. వాల్‌స్ట్రీట్ ఉద్యమాలకు ఇవి కూడా కారణం. అందుకే ఈ ఉద్యమాలు పెట్టుబడిదారీ వ్యవస్థను నిరసిస్తున్నాయి.
సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయాలు పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా తయారయ్యాయి. తోవ చూపవలసిన, దివిటీ పట్టవలసిన ఈ సంస్థలే ప్రభువుల పల్లకీ బోయీలుగా మారాయి. అందుకే ఈ ఉద్యమానికి నవతరం నాయకత్వం వహించింది. కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే పనిలో నిమగమై ఉన్నది.
అందరూ బతకాలి. ఈ భూమండలాన్ని కాపాడుకోవాలి. ఇవే ఈ తరం ముందున్న ప్రధాన సవాళ్లు. ఇదొక సామాజిక బాధ్యత. దీనికి త్యాగమే ఇంధనం.

- చుక్కా రామయ్య ( ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు)
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )
No comments:
Post a Comment