భారత రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్య్రోద్యమ నాయకులు, భారత తొలి న్యాయ శాఖా మంత్రి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి ఎక్కడ వుంది. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆశాలను తుంగలో తొక్కుతున్నాయి. నాయకుల వర్ధంతులు, జయంతుల సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి గణంగా నిర్వహించాము అని చెపుకోవడానికి మాత్రమే సరిపోతున్నది. ట్యాంక్‌బండ్ క్రింద వున్న డా|| అంబేద్కర్ భవన్‌లో గత కొంత కాలంగా కరెంటు లేక చీకటిమయంగా వుంది. దాని ఆలన, పాలన చూస్తే నాదుడు లేడు. సాంఘీక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఏ.పి.స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుండి దాదాపు 400 మంది ఐఏఎస్,ఐపిఎస్ తదితర.....అధికారులను ఇచ్చిన ఘనత ఈ స్టడీ సర్కిల్‌కు వుంది. ఇపుడు ప్రభుత్వం పట్టిచుకోక నిధుల కొరతతో త్రీవ సంక్షోభంలో వుంది. శిక్షణ కార్యక్రమాలు జరగడం లేదు. ఇకా మూతపడే దశకు చేరుకుంది. దళితులకు, బలహీన వర్గాలకు, పేదల అభివృద్ధికి, ప్రజ సంక్షేమము కోసం కృషి చేస్తున్నాము అని చేపుకొనే నాయకులకు ఇవ్వన్ని కనబడవా ?
ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలె. దేశంలో, మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఈ పాశవిక సంఘటనలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా, పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు. శ్రీకాకుళం జిల్లా దళతున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఒక తండ్రి.
అంబేద్కర్ ఆలోచనలు ఈనాడు ఎంతగా వ్యాపించినా, బలపడినా - దేశంలో ఇంకా దళితులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి, దళితులు, బలహీన వర్గాలు అవమానాలకు గురి అవుతున్నారు. దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతున్నది.
అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా ముందుకు రావాలని కొరుకుంద్దాం. డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న మరణించారు.
అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా ముందుకు రావాలని కొరుకుంద్దాం. డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న మరణించారు.
( నేడు ఆయన వర్ధంతి సందర్భంగా...)
No comments:
Post a Comment