Tuesday, May 28, 2013

తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు...

           
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి నందమూరి తారకరామారావు. కొన్ని దశాబ్దాలపాటు సాగిన కృషి, పట్టుదల వల్ల ఆయన సాగించిన నట యాత్ర అనన్య సామాన్యమైంది. తెరపైన కథానాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి, నిజ జీవిత కథానాయకుడిగా తెలుగువారి ముంగిట నిలబడ్డాడు. తెలుగు సినిమాకు, తెలుగు భాషకు, తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు. ముఖ్యంగా తెలుగు సినిమాపై ఆయన చెదిరిపోని ముద్ర వేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన దాదాపు పదేళ్ల తరువాత తిరిగి సినిమాల్లో నటించి విజయం సాధించిన ఘనత ఆయనదే.

     భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహా నటులున్నారు.వారందరూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కానీ ఏ నటుడు నటించనీ, చేయలేని పాత్రలు చేసిన ఏకైక నటుడు నందమూరి తారకరామారావు. వందేళ్ళ సినీ చరిత్రలో ఆయనదో చరిత్ర.

 మే 28 ఎన్‌టి.రామారావు పుట్టినరోజు.

Wednesday, May 1, 2013

ప్రతిధ్వనించిన రోజు ... mayday



'ప్రపంచ కార్మికులారా! ఏకం కండీ  అంటూ ప్రతిధ్వనించిన రోజు  
 శ్రామికులందరూ ఆనందంతో జరుపుకునే పండుగ రోజు  'మేడే'!


మేడే కార్మికవర్గానికి స్ఫూర్తినిచ్చేరోజు.
ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళలు అర్పించేరోజు.
కార్మికవర్గం తమ పోరాటాలను సమీక్షించుకొని ముందడుగు వేసేరోజు.
తమను దోపిడీకి గురి చేసే పెట్టుబడిదారీ విధానం అంతం కోసం ప్రతిఙ్ఞ చేసే రోజు.

               ఇప్పటికి 127 ఏళ్ళ క్రితం మే 1వ తేదీన ప్రారంభమైన కార్మికోద్యమాన్ని అణచాలని పెట్టుబడిదారీవర్గం అనుకుంటే అది ప్రపంచ మంతా అల్లుకుంది. ఆ రణన్నినాదం దేశ దేశాలను చుట్టుముట్టింది. 1889లో ప్యారిస్‌లో జరిగిన రెండో అంతర్జా తీయ కార్మికసంఘం ప్రథమ మహా సభ ప్రతి మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని తీర్మా నించింది. ఎనిమిది గంటల పని దినం, ప్రజాస్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించా లని నిర్ణయించింది. 1917కు కార్మికవర్గం సోవియట్‌లో రాజ్యాధికారానికి వచ్చిన తరువాత ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని చట్ట బద్ధంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇది కార్మికులు సాధించిన విజయం. చరిత్ర మర్చిపోని ఈ అధ్యాయాన్ని స్మరించి, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడమే శ్రమ జీవుల కర్తవ్యం.

  అందరికీ 'మేడే' శుభాకాంక్షలు!