Wednesday, November 30, 2011

తెలుగు సాహితీ జగత్తులో ఒక ధృవతార ....

      తెలుగు సాహితీవేత్తల్లో అగ్రగణ్యులు గురజాడ వెంకట అప్పారావు. అభ్యుదయ సాహిత్యాన్ని సృజించి, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న మహౌన్నతుడు. సాహిత్యమనేది సామాజిక అభ్యున్నతికి, సంఘ సంస్కరణకు దోహదపడాలన్న ఉదాత్త ఆశయం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సామాజిక దురాగతాలపై పోరాటమే సాహిత్యం లక్ష్యమని ప్రగాడంగా విశ్వసించిన నవయుగ వైతాళికుడు.
'' దేశమంటే మట్టికాదోయి
... దేశమంటే మనుషులోయి '' అంటూ సమాజానికి చాటి చెప్పినారు. సంఘ సంస్కరణ కోసం కలం పట్టారు. ప్రధానంగా అంశాలుగా స్త్రీ జనోద్ధరణ, మూడనమ్మకాలు ఎంచుకోన్నారు. ఆయన సంఘసంస్కర్త. చదువు వల్ల సమకూర్చుకున్న విజ్ఞానాన్ని జనులకు పంచిపెట్టేవారు.
            కన్యాశుల్కం నాటకం చాలా అద్భుతం. వాస్తవిక జీవితం నుండి సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు వాడుక బాషలో 1892 లో కన్యాశుల్కం నాటకాన్ని రాశారు. వేలలాది ప్రదర్శనలిచ్చిన ఇచ్చారు. వందల సంవత్సరాలు దాటినా విశేష జనాదరణ పొందుతున్న నాటకం కన్యాశుల్కం. జాతీయ భాషల్లోనే కాకుండా ఇతరల దేశాల బాషల్లో కూడా అనువదితమైంది. ఆనాటి సమాజంలో బాల్యవివాహలే ప్రధాన ప్రేరణ. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్ళి పేరిట అమ్ముకోవటాన్ని గురజాడ తీవ్రంగా నిరసించారు.
                  గురజాడ కలం నుంచి రచనలు ఎన్నో... ఆయన రచించిన దేశభక్తి గేయాలు అందరికి నవ ఉత్తేజాన్ని నింపాయి. ప్రగతిశీల భావాలు కలిగిన అభ్యుదయ రచయితలకు, వ్యక్తులకు కాదు అందరికి ఉత్సహన్ని ఇచ్చాయి. సామాజిక దురాచారాలను నిరసిస్తూ నైతిక ప్రమాణాల వ్యాప్తి చేయటంమే సాహిత్య కర్తవ్యం అని విశ్వసించినవారు.వారి రచనలు స్ఫూర్తిదాయకం.
                   గురజాడ వెంకట అప్పారావు రాయవరం గ్రామం, ఎలమంచిలి తాలూకా, విశాఖపట్నం జిల్లా లో 1862 సెప్టెంబర్‌ 21 జన్మించారు.
ఆయన కలం అలసి సొలసి పోయి 
ఆయన 97వ సం||లో  1915 నవంబర్‌ 30న కన్ను మూశారు. 
( నేడు వారి వర్థంతి సందర్భంగా....) 

Friday, November 25, 2011

సచిన్‌ సెంచరీల '' సెంచరీ '' ఏపుడూ....?

                ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ మిస్ చేశారు. వందో శతకానికి ఆరు పరుగుల దూరంలో సచిన్ ఔట్ అయ్యారు.  సెంచరీ మిస్ చేసుకోవడం సచిన్‌కిది 16 వ సారి. 
              ఇంకా ఈ టెస్టులో భారత్‌కు మళ్ళీ ఇన్నింగ్స్‌ రావడం, మరల సచిన్‌ సెంచరీ చేయడం చాల కష్టమే. వచ్చే నెలలో జరుగనున్న మూడు వన్డేలకు సచిన్‌ కు విశ్రాంతి ఇచ్చారు. కాబట్టి  ఈ మధ్యకాలంలో సెంచరీల '' సెంచరీ '' లేదు.
               వెస్టిండీస్‌తో జరుగు మూడు ఒన్డేలకు భారత్ జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతి ఇస్తూ, కెప్టెన్‌గా వీరేంద్రసెహ్వాగ్‌ను ఎంపిక చేస్తూ చేసింది.
               వీరేంద్రసెహ్వాగ్‌ ( కెప్టెన్‌ ), గౌతమ్ గంభీర్, కోహ్లీ, పటేల్, మనోజ్ తివారీ, రైనా, ఉమేష్ యాదవ్, రాహుల్ శర్మ, ప్రవీణ్ కుమార్, జడేజా, రహానే, వరుణ్, రోహిత్‌శర్మ, వినయ్‌కుమార్ తదితరులను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా ఈ వన్డేలకు యువరాజ్, హర్భజన్‌సింగ్‌ను దూరంగా ఉంచింది.


నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం పెరగడానికా...?

    చిల్లర వ్యాపార రంగం (రిటైల్‌)లోకి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ గురువారం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల శాఖ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఆయన నేతృత్వంలోనే జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదముద్ర వేసింది.  సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లోకి వంద శాతం, మల్టీబ్రాండ్‌ రిటైల్‌లోకి 51 శాతం ఎఫ్‌డిఐలకు అనుమతిస్తారు. దీంతో ప్రపంచ బడా రిటైల్‌ మార్కెట్లు   మన దేశ చిల్లర వ్యాపారంలో పెత్తనం చెలాయించేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో మాత్రమే 51 శాతం ఎఫ్‌డిఐలకు అనుమతివుంది. మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో అసలు లేదు.

             మార్కెట్‌ గుత్తాధిపత్యం వల్ల వినియోగదారుల ప్రయోజనాలకు హానికరము. దేశ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. వినియోగదాలు, చిల్లర వర్తకం దారులు చాలా నష్టపోతారు. సంప్రదాయకంగా చిల్లర వర్తకం మీద ఆధారపడిన కుటుంబాలు వీదిన పడతాయి.
              దేశవ్యాప్తంగా దాదాపు 1.2 కోట్ల షాపుల్లో దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటిలో 95 శాతానికి పైగా షాపులు కేవలం 500 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో స్వయం ఉపాధి కల్పించుకున్న వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ రంగంలో ఎంఎన్‌సిల ప్రవేశం ద్వారా వీరంతా దెబ్బతింటారు. సూపర్‌ మార్కెట్లు ఏర్పాటైన ప్రతి చోటా చిన్న వ్యాపారులు రోడ్ల పాలైన విషయాన్ని అంతర్జాతీయ అనుభవాలు మన కళ్లకు కడుతూనే ఉన్నాయి.                 
                మన దేశానికి, మాన ప్రజలకు నష్టం తేచ్చే దానిని వ్యతిరేకిద్దాం.