Friday, November 25, 2011

నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం పెరగడానికా...?

    చిల్లర వ్యాపార రంగం (రిటైల్‌)లోకి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ గురువారం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల శాఖ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఆయన నేతృత్వంలోనే జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదముద్ర వేసింది.  సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లోకి వంద శాతం, మల్టీబ్రాండ్‌ రిటైల్‌లోకి 51 శాతం ఎఫ్‌డిఐలకు అనుమతిస్తారు. దీంతో ప్రపంచ బడా రిటైల్‌ మార్కెట్లు   మన దేశ చిల్లర వ్యాపారంలో పెత్తనం చెలాయించేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో మాత్రమే 51 శాతం ఎఫ్‌డిఐలకు అనుమతివుంది. మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో అసలు లేదు.

             మార్కెట్‌ గుత్తాధిపత్యం వల్ల వినియోగదారుల ప్రయోజనాలకు హానికరము. దేశ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. వినియోగదాలు, చిల్లర వర్తకం దారులు చాలా నష్టపోతారు. సంప్రదాయకంగా చిల్లర వర్తకం మీద ఆధారపడిన కుటుంబాలు వీదిన పడతాయి.
              దేశవ్యాప్తంగా దాదాపు 1.2 కోట్ల షాపుల్లో దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటిలో 95 శాతానికి పైగా షాపులు కేవలం 500 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో స్వయం ఉపాధి కల్పించుకున్న వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ రంగంలో ఎంఎన్‌సిల ప్రవేశం ద్వారా వీరంతా దెబ్బతింటారు. సూపర్‌ మార్కెట్లు ఏర్పాటైన ప్రతి చోటా చిన్న వ్యాపారులు రోడ్ల పాలైన విషయాన్ని అంతర్జాతీయ అనుభవాలు మన కళ్లకు కడుతూనే ఉన్నాయి.                 
                మన దేశానికి, మాన ప్రజలకు నష్టం తేచ్చే దానిని వ్యతిరేకిద్దాం.

No comments:

Post a Comment