Friday, June 22, 2012

వేడి వేడిగా చల్లచల్లగా...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్టణం ,  సింహాచలం,  ఆరకు లోయ,  బొర్రా గుహలు,  తిరుపతి,  శ్రీకాళహస్తి,  తమిలనాడు రాష్ట్రం వెల్లుర్ పట్టణంలోని గొల్డెన్ టెంఫుల్ ... మే 28 నుండి జున్ 3 వరకు    ముడు స్నేహితుల కుటుంబలతో  వెల్లివచ్చాం.  విశాఖపట్టణంలొ, గొల్డెన్ టెంఫుల్ ల దారి లో  వేడిని  భారించలేకపోయాం.   తిరుమల, బొర్రా గుహలు  చాలా ఆసక్తికరముగా,  ఆహ్లాదకరముగా చల్లచల్లగా ఉంది.  పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు.  మా టూర్  వేడి వేడిగా చల్లచల్లగా  జరిగింది.
విశాఖపట్టణం లో చూడదగిన ప్రదేశాలు :


   1. సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.  2. రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విశాలత తగ్గింది. కొద్దిగా  కాలుష్యంగా ఉంది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే జలాంతర్గామి ( కల్వారి ) మ్యూజియం (భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు ) ఉన్నాయి. 3. కైలాసగిరి- శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి కొండమీద.  4. వైజాగ్ స్టీలు ప్లాంటు. చాలా  పెద్దది.  చూడటానికి కనిసం 8 గంటలు వాహనం ద్వార పడుతుంది.   5. రిషికొంద బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో వున్నది.  ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.  6. భ్మిలీ బీచ్ - నగరానికి  28కి.మీ దూరంలో వున్నది.  తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.  7. జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు    8.విశాఖ నౌకాశ్రయము,  విశాఖపట్నం చేపలరేవు 9.ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విద్యా కళా పరిషత్)    10. రామనాయుడు స్టూడియో   సముద్ర తీరంలో కొండ మీద  వుంది.         
విశాఖపట్టణంలొ వేడిని  భారించలేకపోయాం. దానితో రెండు రొజులు బీచ్ లలో ఎంజయ్ చేశాం. పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు. 

అరకు  : ఆరకు లోయ సముద్రమట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 115 కి.మి.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో , కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.  విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి.  ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్ , ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు,  వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లొ ఉదయం 6.50 కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి. అది అలా కొండలు , లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ఫ్రయాణం లొ "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది. అది భారతదేశంలొ అతి ఎత్తులొ వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు. ఇక వెళ్లే దారిలొ బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణం లో చూడవచ్చు. దారిలో అనంతగిరి కొండల లో కాఫీ తోటలు ఉన్నాయి. అరుకులొ వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు,  ట్రైబల్ కాటేజీలు వుంటాయి .  


శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో అందంగా తయారవుతాయి. అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి. ఇక వర్షాకాలం ఐతే పచ్చదనంతో కళకళలాడుతుంది. అప్పుడు వెళ్ళేవాళ్ళు వర్షాని తడవని బట్టలు, గొడుగులు పట్టుకెళ్ళటం మంచిది. చాల ముఖ్యమైనది  బొర్రా గుహలు.  చాలా ఆసక్తికరముగా,  ఆహ్లాదకరముగా చల్లచల్లగా ఉంటుంది.  చూడవలసిన ప్రదేశాలు : అరకు , బొర్రా గుహలు,  పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, కాఫీ తోటలు , గాలి కొండలు ...   
తిరుపతి లో చూడదగిన విశేషాలు :


   1. తిరుపతి  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైనది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి". తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం  లక్షలాది భక్తులు సందర్శిస్తుంటారు. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం.  కొండలపై మంచి గాలితో , చాలా చల్లచల్లగా వుంది. 
2. శ్రీకాళహస్తి,  ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో  ఉంది.  3 కపిల తీర్ధము ; శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్ధం లేదా ఆళ్వార్ తీర్ధం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది.  4 కాణిపాకం : తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.    5 శ్రీనివాస మంగాపురం ;  6 కిలోమీటర్లు దూరంలో  ఉంటుంది.   6. గొల్డెన్ టెంఫుల్ :   తిరుపతికి సుమారు 113 కిలోమీటర్లు దూరంలో,   చిత్తూరు కు 35 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. తమిలనాడు రాష్ట్రం, వెల్లుర్  జిల్లాలోని పట్టణం.  గొల్డెన్ టెంఫుల్  చాలా విశాలాంగా ....  చాలా ఆసక్తికరముగా,  ఆహ్లాదకరముగా చల్లచల్లగా ఉంటుంది.

2 comments:

  1. మరిన్ని ఫొటోలు ఉంచాల్సింది..

    ReplyDelete