Tuesday, October 23, 2012

దసరా శుభాకాంక్షలు...


మీకు, మీ కుటుంబ సభ్యులకు,  శ్రేయాభిలాషులకు 
 దసరా శుభాకాంక్షలు...2012.

  శుభాభినందనలతో.....    వీరయ్య కే

Tuesday, October 9, 2012

ప్రపంచ యువత ఆయనే బొమ్మ రూపంలో తలచుకుంటుంది...


           యువత ధరిస్తున్న టీ షర్ట్స్‌పై ఎక్కువగా దర్శనమిస్తుంది ఒక బొమ్మ. మోటార్ వాహనాలు, సెల్‌ఫోన్స్, ఆఖరికి సినిమాల్లోనూ ఆ ప్రతి రూపాన్ని పెట్టటం కోసం యువత ఇష్టపడుతుంది. ఎక్కువ మంది యువతకు ఆ వ్యక్తి జీవితం తెలియకుండానే. ఆయన చనిపోయి 45 సంవత్సరాలు గడుస్తున్నా తెలిసో తెలియకో ఆ పేరు, ఆ రూపాన్ని ప్రపంచ యువత మరోరూపంలో తలచుకుంటుంది. ఆయనెవరో కాదు, నిత్య నూతన విప్లవ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఎర్నెస్టో చేగువేరా.

          1928, జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో  జన్మించారు.  వైద్య విద్యనభ్యసించి  చదువు పూర్తికాగానే అర్జెంటీనాలో 2,800 మైళ్ళు ప్రయాణం చేశాడు. తన మిత్రుడితో కలిసి ఒక పాత మోటార్‌సైకిల్‌పై లాటిన్ అమెరికా దేశాలన్నీ చుట్టొచ్చాడు. నియంతల పాలనలో మగ్గిపోతూ, పేదరికంతో అల్లాడిపోతున్న అభాగ్యుల జీవితాలను చే కళ్ళారా చూసి చలించిపోయాడు. లాటిన్ అమెరికా పేదల జీవితాల్లో కొత్త సూర్యోదయాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. దోపిడీ శక్తులను అంతమొందించాలంటే సమసమజాన్ని స్థాపించటం ఒక్కటే మార్గమని 'చే' భావించాడు.

           1955 జూలైలో ఇప్ప టి క్యూబా దేశాధినేత అప్పటి పోరాటయోధుడు ఫైడల్ కాస్ట్రోను కలుసుకున్నారు. ఆయనతో కలిసి క్యూబా విప్లవ పోరాటంలో చేరాడు. 1956 నవంబర్25 నుంచి, డిసెంబర్ 2 వరకు 'గ్రాన్‌మా' నౌకలో 82 మందితో బయలుదేరిన విప్లవ తిరుగుబాటు యాత్రలో కాస్ట్రోతో కలిసి క్యూబా విప్ల వం విజయవంతం కావటంలో కీలకపాత్ర వహించాడు. నిరంతర విప్లవకారుడైన 'చే', క్యూబాలో విజయం లభిస్తే తాను మరో లాటిన్ అమెరికా దేశంలో విప్లవం నిర్మించటానికి వెళతానని అలా అయితేనే నీతో కలిసి వస్తానని, 1955 లో కాస్ట్రో నుంచి మాట తీసుకున్నాడు. ఆ మాట ప్రకారం లాటిన్ అమెరికాపై ఎర్ర బావుటా ఎగరేసేందుకు క్యూబాలో అధికారాన్ని త్యజించి విప్లవ బాట పట్టాడు.