Thursday, April 11, 2013

సామాజికోద్యమ చైతన్య జ్వాల ...



               సామాజికోద్యమ చైతన్య జ్వాల జ్యోతిరావుబాఫూలే. నేడు మహాత్మ జ్యోతిరావు బాపూలే జయంతి. జయంతిని దేశ ప్రజలు ఏప్రెల్‌ 11న జరుపుకుంటారు. దేశంలో రాజ్యాధికారం హస్తగతం చేసుకుని పెత్తందారి విధానాలతో కులాలను విడగొట్టి బ్రాహ్మణ ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రకులాలపై యుద్ధం ప్రకటించారు ఫూలే. కులమత ఆధిపత్యాలను చీల్చి చెండాడిని సామాజిక విప్తవయోధుడాయన. మహాత్మా జ్యోతిరావు బాఫూలే 1827 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో ఉన్న 'సతారా'లో 'మాలి' అనే శూద్రకులంలో జన్మించారు. ఆయనకు 1840లో సావిత్రి బాపూలేతో బాల్య వివాహం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌లో అగ్రకుల పెత్తందారీ తనాన్ని, బ్రాహ్మణ కులవ్యవస్థ నుంచి ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్య్రాలను కల్పించలేని ఆపార్టీ ప్రవచించే జాతీయ వాదానికి అర్థం లేదని చెప్పారు. 1873లో 'గులాంగిరి' అనే గ్రంధాన్ని ప్రచురించి ప్రాచుర్యం పొందారు. బ్రాహ్మణులు సాగించిన అన్యాయాలను, అంటరాని తనాన్ని, వివక్ష రూపాలను, అణచివేతను గులాంగిరి గ్రంథంలో ఆయన సమగ్రంగా వివరించారు. నిచ్చేన మెట్ల సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న క్లిస్ట సమస్యలను 'తృతీయరత్న ' నాటకంలో కళ్లకుగట్టినట్లు వివరించారు. కుల, మత ఆగడాలను తన రచనల ద్వారా ప్రచారం చేశారు. దళిత కౌలు రైతులు మౌలిక సమస్యలను అధిగమంచేందుకు , మెలుకువలు తెలిపేందుకు పూలే క్షేత్రస్థాయిలో దర్శించారు.
                 ఇల్లాలి చదువు -ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను అనేనినాదంతో బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆయన భార్యకు విద్యను నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయినిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశారు. ''సత్యశోధక సమాజ్‌'' అనే సంస్థద్వారా ఆధిపత్య కులాల సాంస్కృతిక భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేశారు. ఆయన చేసిన చేవలను గుర్తించి ఆనాటి సమాజం ఆయనకు 1888లో 'మహాత్మా ' అని బిరుదు పొందారు. వృద్ధాప్యంలో చేతిలో చిల్లిగవ్వలేకుండా జీవించారు.
              1889లో అక్టోబర్‌లో అస్వస్థతకు గురయి అదే ఏడాది నవంబర్‌28న తుదిశ్వాస వదిలారు.

విజయం చెకూరాలని ఆశిస్తు...

             ఈ విజయనామ సంవత్సరము మీకు అన్ని విషయాలలొ  
                          విజయం చెకూరాలని ఆశిస్తు...