Tuesday, May 28, 2013

తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు...

           
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి నందమూరి తారకరామారావు. కొన్ని దశాబ్దాలపాటు సాగిన కృషి, పట్టుదల వల్ల ఆయన సాగించిన నట యాత్ర అనన్య సామాన్యమైంది. తెరపైన కథానాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి, నిజ జీవిత కథానాయకుడిగా తెలుగువారి ముంగిట నిలబడ్డాడు. తెలుగు సినిమాకు, తెలుగు భాషకు, తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు. ముఖ్యంగా తెలుగు సినిమాపై ఆయన చెదిరిపోని ముద్ర వేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన దాదాపు పదేళ్ల తరువాత తిరిగి సినిమాల్లో నటించి విజయం సాధించిన ఘనత ఆయనదే.

     భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహా నటులున్నారు.వారందరూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కానీ ఏ నటుడు నటించనీ, చేయలేని పాత్రలు చేసిన ఏకైక నటుడు నందమూరి తారకరామారావు. వందేళ్ళ సినీ చరిత్రలో ఆయనదో చరిత్ర.

 మే 28 ఎన్‌టి.రామారావు పుట్టినరోజు.

No comments:

Post a Comment