Tuesday, December 13, 2011

భవిష్యత్తు సోషలిజానిదే... !

  • ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి
  • కేపిటలిజం దుర్మార్గానికి తెర దించాలి
  • కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ మహాసభ ప్రకటన
            పెట్టుబడిదారీ వ్యవస్థ తాత్కాలికంగా ఆధిపత్యం కొనసాగించినా అంతిమంగా భవిష్యత్తు సోషలిజానిదేనని ఇక్కడ ముగిసిన కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ మహాసభ ఉద్ఘాటించింది. ఈ నెల 9-11 తేదీల మధ్య ఏథెన్స్‌లో జరిగిన ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల నుండి 78 పార్టీలకు చెందిన దాదాపు 400 మందికి పైగా ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ మహాసభల్లో పాల్గొనలేకపోయిన దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ సందేశాలను పంపాయి. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత గత 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎదుర్కొన్న అనుభవాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ప్రధానంగా చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధాల వంటి పరిణామాలు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానుకూల అంతర్జాతీయతా వాదాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమిని బలోపేతం చేయటం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి సామ్యవాద వ్యవస్థను నిర్మించాలని ఈ మహాసభలు తమ తుది ప్రకటనలో పిలుపునిచ్చాయి. 2008లో సావోపౌలో (బ్రెజిల్‌), 2009లో న్యూఢిల్లీ (భారత్‌), 2010లో ష్వేన్‌ (దక్షిణాఫ్రికా)లలో జరిగిన 10, 11, 12 వ అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల మహాసభలు విశ్లేషించి జారీ చేసిన ప్రకటనల్లోని అంశాలను ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయని ఈ మహాసభలు తమ ప్రకటనలో వివరించాయి.

                     ప్రస్తుతం పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థ కార్పొరేట్‌ నష్టాలను ప్రజలపై రుద్దుతూ ఉత్పాదక శక్తులను, వనరులను నాశనం చేస్తోందని, ఫ్యాక్టరీల మూసివేత ద్వారా అనేక మందిని రోడ్లపాలు చేస్తోందని ఈ మహాసభ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కార్మికుల సంఘటిత హక్కులు, వేతనాలు, పెన్షన్లు, సామాజిక భద్రత వంటి వాటిపై జరుగుతున్న దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది. అనేక దేశాల్లో ప్రజాతంత్ర హక్కులపైన, సార్వభౌమత్వంపైనా దాడులు పెరిగిపోతున్నాయని, రాజకీయ వ్యవస్థలు మరింత క్రియాశీలకంగా మారుతూ కమ్యూనిస్టు వ్యతిరేకతను పెంచిపోషి స్తున్నాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా వంటి ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎగసిపడిన ఉద్యమాలకు సారథ్యం వహించిన ప్రజలకు, కార్మికులకు మహాసభ అభినందనలు తెలియచేసింది. లిబియాపై నాటో, ఐరోపా కూటమి దేశాలు కొనసాగించిన సామ్రాజ్యవాద దురాక్రమణను మహాసభ తీవ్రంగా ఖండించింది. వ్యవస్థల్లో పెరుగుతున్న వైరుధ్యాలను సమర్ధవంతంగా వినియోగించుకుని ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ కోసం కార్మిక, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు కమ్యూనిస్టు, వర్కర్ల పార్టీలు చారిత్రాత్మక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిణామాలు మరోసారి ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది.
                   ఈ క్రమంలోనే ఇప్పుడు అంతర్జాతీయంగా పునరేకీకరణలు కొనసాగుతున్నాయని, అమెరికా వంటి పెట్టుబడిదారీ వ్యవస్థలు క్రమంగా బలహీన పడుతుండగా చైనా వంటి దేశాలు ప్రబల ఆర్థిక శక్తులుగా ఎదుగుతుండటమే ఇందుకు నిదర్శనమని వివరించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మా ర్గానికి తెర దించేందుకు కార్మిక, కర్షక, శ్రామిక శక్తులు, గ్రామీణ పేదలు, మహిళలు ఏకమై ప్రజాపోరాటాలను మరింత బలోపేతం చేయాలని ఈ మహాసభ పిలుపునిచ్చింది. భవిష్యత్తు సోషలిజానిదేనని ఈ ప్రకటన పునరుద్ఘాటించింది. 
                                ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

13 comments:

  1. భవిష్యత్తు సోషలిజానిదేనని కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ మహాసభ ఉద్ఘాటించిందంటే ఆశ్చర్యం లేదు. ఎవరి స్వర్గాన్ని గురించి వాళ్ళు కలలు కంటూనే ఉంటారు కదా!

    ReplyDelete
  2. సామ్రాజ్యవాదులు నయా ఉదారవాద ఆర్థిక విధానాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చి ఏమయ్యింది?

    ReplyDelete
  3. నిజమేనండో్య్. ఆర్థిక సంక్షోభం వచ్చి అతలాకుతలంగా ఉంది.

    ఒకప్పుడు (దాదాపు నూరేళ్ళ క్రితమే) కమ్యూనిష్టు స్వర్గం సోవియట్ యూనియన్ రూపంలో భూమికి దిగింది. ఏందుచేతనీ గాని ఆమధ్య ముక్కలు ముక్కలుగా పేలిఫోయింది.

    అయితేనేం. కలలు కనటంలో తప్పేమీ లేదుకదా!
    సూపర్ నోవా అయొపోయిన సోవియట్ సంగతి మర్చిపోయు కమ్యూనిష్టులూ, ఆర్థిక సంక్షోభం సంగతి పక్కన బెట్టి సామ్రాజ్యవాదులూ అందరూ కలలు కననిద్దాం. మనకేం. కలలే కదా.

    వాస్తవ ప్రపంచంలో జీవించటం యెవరూ చేయటం లేదుకదా.

    ReplyDelete
  4. సోషలిజం వచేవరకూ భివిష్యత్తు అంధకారమే !

    ReplyDelete
  5. అందరూ ఒకటే. ఎంతమంది బిల్లియనీర్స్ ఉన్నారో చూడండి. మొదటి మూడు స్థానాలూ అమెరికా,చైనా,రష్యా.

    http://en.wikipedia.org/wiki/List_of_countries_by_the_number_of_US_dollar_billionaires

    World wide top 10 (2011)

    Rank Country/Region Number of billionaires[1] Share of
    world total (%) Billionaires per 10M Category
    — World total 1210 100.0 1.7
    1 United States 412 34.0 13.2 American billionaires
    2 People's Republic of China 115 10.6 0.9 Chinese billionaires
    3 Russia 101 8.3 7.1 Russian billionaires
    4 India 55 4.5 0.5 Indian billionaires
    5 Germany 52 4.3 6.4 German billionaires
    6 Turkey 38 3.1 5.2 Turkish billionaires
    7 Hong Kong 36 3.0 51.0 Hong Kong billionaires
    8 United Kingdom 33 2.7 5.3 British billionaires
    9 Brazil 30 2.5 1.6 Brazilian billionaires
    10 Japan 26 2.1

    ReplyDelete
  6. నా అభిప్రాయంలో సంపూర్ణంగా ఆదర్శవంతమైన సమాజం ఎప్పటికీ సాధ్యం కాదు.సోషలిజం,కేపిటలిజం, రెండిట్లోను లోపాలు ఉన్నాయి.రష్యా, చైనా, అమెరికా,ఇండియా అన్నీ ఒకటే.ఏదో ఒక బలమైన పాలకవర్గం ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నవే.రష్యా ,చైనాల్లో ఆచరణ లో కమ్యూనిజం విఫలమైనది కదా. ఏ ఇజమైనా శాంతియుతంగా,ప్రజా స్వామ్య పద్ధతిలో లక్ష్యాన్ని సాధించాలి. మానవుల్లో ఉన్న స్వార్థబుద్ధి పోదు.అందువల్ల maximum possible benefit for maximum possible number of people సాధించగలిగితే ,అదీ ,శాంతి యుతంగా,చాలును.అదే మహా భాగ్యం.

    ReplyDelete
    Replies
    1. నిజమే! చాలా చక్కటి విషయం చెప్పారు. సరి అయిన అవగాహన మరియు మానవ విలువలు వుంటే సమ సమాజ స్థాపన సాధ్యమే. కానీ అది మన వ్యక్తిగత స్థాయి దగ్గర మొదలయ్యి, కుటుంబ స్థాయి ఎదిగి, మన చుట్టూ పక్కల వారితో సంబంద బాంధవ్యాలు నెరపి, పరిణతి చెందిన పిమ్మట సమాజ స్థాయిలో ఇది తప్పక సాధ్యమే. కావలిసినది గుప్పెడు మనసు, అవగాహన. సమయం పడుతుంది, కాని మానవ సమాజానికి అదియే అంతిమ లక్ష్యం కావాలి. మిగత ప్రదేశాలలో విఫలమయ్యింది అంటే దానికి కారణాలు వేరు, పూర్తీ అవగాహనతో రాలేదు అన్నది ఒక కారణమైతే, నిజమైన సమ సమాజము ఏర్పాటు జరగలేదు. ఒక మంచి పని వంద సార్లు విఫల మైన మరి ఒక్క సారి ప్రయత్నించాలి. కనీసం లోకములో దుర్మార్గత్వం తగ్గుతుంది.

      Delete
  7. @కమనీయం గారూ బాగా చెప్పారు. మానవుల్లో ఉన్న స్వార్థబుద్ధి పోదు.

    ReplyDelete
  8. తెరగారు అన్నట్టు ఒకతరం యువత జీవన చైతన్యంలో భాగం కమ్యూనిజం, నిజాలు మాట్లాడే ధైర్యం లేక డూప్లికేట్‌ ఇజాలని సృష్టించే అతివాద మతవాద అవకాశవాద శక్తులనుండి యువతని కార్యోన్ముఖులని చేయాలి. తెలుగు బ్లాగుల్లో సోషలిజం కమ్యూనిజం అభిమానించే నిజమైన నిబద్ధత ఉన్న శక్తులన్నీ ఒకతాటిమీదకి రావాలి. అప్పుడే కులాల,మతాల,ప్రాంతాల సెంటిమెంట్ల మధ్య బహునేర్పుగా చొప్పిస్తున్న బూర్జువా భూస్వామ్య సిద్ధాంతాల విషప్రచారాన్ని తిప్పికొట్టగలుగుతాం.

    ReplyDelete
  9. భవిష్యత్తు సోషలిజానిదే... !

    In your dreams ass holes. You mofos have been kicked hard so much that even China is now a capitalist country.

    ReplyDelete
  10. రమణారావు గారు, స్వార్థం ఏ రకంగానూ అభివృద్ధికరం కాదు. కేవలం వ్యక్తి ప్రయోజనం కోసం నిర్దేశించబడినది సమాజానికి అభివృద్ధికరం కాదు. సమాజానికి వినాశనం జరిగినా వ్యక్తి ప్రయోజనం కోసం నిర్దేశించబడిన సూత్రాలు వాటిని లెక్క చెయ్యవు. ఎంత స్వార్థపరుడైనా కేవలం డబ్బు సంపాదించడంతో సంతృప్తిపడిపోడు. సమాజంలో తనకి ఒక ఐడెండిటీ కావాలనుకుంటాడు, ఐడెండిటీ కోసం పోటీకి దిగుతాడు. ఆ కీర్తి కాంక్ష కూడా మనిషి చేత నీచమైన పనులు చెయ్యిస్తుంది. రెండు కార్పొరేషన్‌ల మధ్య పోటీ ఉందనుకుందాం. ఆ రెండు కార్పొరేషన్‌లవాళ్ళూ డబ్బులు మిగుల్చి లాభాలు చూపించుకోవడానికి ఉద్యోగుల జీతాలకి కోత పెట్టగలరు కానీ పోటీ వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా ఏమీ నష్టపోరు. నష్టపోయేది వాళ్ళని నమ్ముకున్న ఉద్యోగులే. ICICI, HDFC బ్యాంక్‌లలో ఉద్యోగులకి జీతాలు ఎందుకు తక్కువ ఇస్తున్నారో ఇక్కడే అర్థమైపోతుంది. చమురు కోసం అమెరికా సామ్రాజ్యవాదులకీ, సద్దాం హుస్సేన్‌కీ మధ్య జరిగిన యుద్ధంలో చమురు కంపెనీలు ఏ రకంగానూ నష్టపోలేదు. సెక్యూరిటీ ఖర్చు పెరిగిందని చెప్పి చమురు ధరలు పెంచేసి లాభాలు పెంచుకున్నాయి. స్వార్థం ఎక్కడ ఉన్నా స్వార్థపరులు మాత్రమే బాగుపడతారు కానీ వాళ్ళని నమ్ముకున్నవాళ్ళు నష్టపోతారు. నెపోలియనిక్ యుద్ధాలు, రూసో-టర్కిష్ యుద్ధాలు, రూసో-జపనీస్ యుద్ధం తదితరాలన్నీ పాలక వర్గాల స్వార్థాల వల్ల వచ్చినవే. ఏ యుద్ధం జరిగినా పాలక వర్గంవాళ్ళ దగ్గర విశ్వాసంగా పని చేసిన సైనికులే బలి పశువులు అవుతారు కదా. స్వార్థం అనేది ప్రెగ్నెన్సీ లాంటిది. దానికి ఇన్టెన్సీ తేడాలు ఉండవు. చరిత్రలో ఏ పుటలు చదివినా స్వార్థం వల్ల వినాశనమే కానీ అభివృద్ధి కనిపించదు. రష్యన్ చక్రవర్తులు మాస్కో నుంచి వ్లాడివాస్టక్ వరకు రైలు మార్గం వేస్తే వ్లాడివాస్టక్ ప్రాంతం అభివృద్ధి చెంది రష్యన్ సామ్రాజ్యం బలపడిపోతుందని జపాన్ అసూయపడడం వల్ల రూసో-జపనీస్ యుద్ధం వచ్చింది. వ్లాడివాస్టక్ ప్రాంతంలో రైలు మార్గం లేకపోవడం వల్ల రష్యన్ సైనికులు ఎక్కువ మంది తూర్పునకు వెళ్ళలేకపోయారు. దీనితో రూసో-జపనీస్ యుద్ధంలో రష్యా ఓడిపోయింది. రష్యన్ ప్రభుత్వం ఎలాగోలాగ మాస్కో-వ్లాడివాస్టక్ రైలు మార్గం పూర్తి చేసింది. కానీ అట్లాంటిక్ మహాసముద్రంపై పట్టు కోసం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో తలదూర్చడం వల్ల జార్ చక్రవర్తుల ప్రభుత్వం 1917లో కుప్పకూలిపోయింది. 1917లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం జార్ చక్రవర్తిని జైలులో పెట్టింది. కానీ అతని స్వార్థం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రాలేదు కదా. సామాజిక ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే జార్ చక్రవర్తులలాగ బిహేవ్ చెయ్యడం కూడా తప్పు అనుపించదు. ఎందుకంటే స్వార్థం అనేది ఇంటెన్సిటీ తేడాలు తెలియనిది కదా. స్వార్థం ఉన్నంత వరకు వ్యాపారుల మధ్య పోటీ ఉంటుంది, వ్యాపారాల విషయంలో దేశాల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఈ పోటీ కోసం యుద్ధాలు కూడా జరుగుతాయి. యుద్ధాలు జరగడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతాయి. యుద్ధాలు చెయ్యించినవాళ్ళకి డబ్బులు మాత్రమే ఖర్చవుతాయి, యుద్ధాలు చేసినవాళ్ళకి మాత్రం ప్రాణాలు పోతాయి. ఇద్దరు స్వార్థపరులు ఉన్నా వాళ్ళలో ఒకడు బాగుపడితే ఇంకొకడు భరించలేడు. కనుక స్వార్థం అనేది ఏ రకంగానూ అభివృద్ధికరం కాలేదు.

    ReplyDelete
  11. కొన్ని రకాల అభ్యంతరకరమైన భాషలుంటాయి.
    1. అసభ్యమైన భాష. భాషని దూషణకోసం వాడటం. ఉదాహరణకు పైని తేజా గారి వ్యాఖ్య. వారి అభిప్రాయంతో అంగీకరించ గలవారైనా వారి భాషకు నొచ్చుకుంటారు.
    2. కాలం చెల్లిన పదజాలంతో కూడిన భాష. నిఘంటువుల సహాయం లేకుండా చదవలేనిది. చదువరులు పారిపోరా?
    3. కొన్ని ప్రత్యేకమైన వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రమే పరిమితమైన భాష. ఉదాహరణకు కమ్యూనిష్టుల భాష. వేరేవాళ్ళకు అర్ధం కాదు. దానివల్ల వాళ్ళు చదువరులను కోల్పోతున్నామన్న స్పహ వారికి యెందుకు ఉండదో తెలియదు.
    4. వెటకారపు భాష. వెటకారం కొంచెగా సహజమే వాదనలలో. కాని మోతాదు మించితే బాగుండదు.

    అందరూ, సభ్య సమాజానికి ఇబ్బంది కలిగే భాషను వాడకుండా జాగ్రత పడాలని వినతి.

    ReplyDelete
  12. > యుద్ధాలు చెయ్యించినవాళ్ళకి డబ్బులు మాత్రమే ఖర్చవుతాయి, యుద్ధాలు చేసినవాళ్ళకి మాత్రం ప్రాణాలు పోతాయి.
    ప్రవీణ్ శర్మగారు బాగా వ్యాఖ్యానించారు, 100% నిజాలు.

    ReplyDelete