ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
జనవరి 28 నుంచి ....
పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ షెడ్యూలు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లోను, మిగిలిన చోట్ల ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్‌లోని 60 స్థానాలకు జనవరి 28వ తేదీన, పంజాబ్‌లోని 117 స్థానాలకు, ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలకు జనవరి 30న, గోవాలోని 40 స్థానాలకు మార్చి 3వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని 403 నియోజకవర్గాలకు గాను ఫిబ్రవరి 4, 8, 11, 15, 19, 23, 28వ తేదీల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కాగా, ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వస్తుందని, ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, అభ్యర్థులు గుర్తుంచుకోవాలని ఖురేషీ సూచించారు.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో.....
No comments:
Post a Comment