Sunday, January 29, 2012

స్వతంత్ర శక్తిగా ఎదగడమే లక్ష్యం - ప్రకాశ్‌ కరత్‌

  • వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయానికై కృషి
  • ఆర్థిక సంస్కరణలపై విశాల ప్రజా ఉద్యమం
  • మతోన్మాదంపై పోరాటం కొనసాగిస్తాం
  • ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం
'               ఎన్నికల వైఫల్యాలు, పార్టీకి అత్యంత బలమైన బెంగాల్‌లో జరుగుతోన్న దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ ప్రభావాన్ని, పునాదిని విస్తరింప చేయడం అత్యంత ప్రధానం. పార్టీ స్వతంత్ర కార్యాచరణను పెంపొందించడం, విస్తరింప చేయడం ద్వారానే ఇది సాధ్యం. పార్టీ పెరుగుదలకు ఇదే కీలకం..' అని సిపిఎం ముసాయిదా రాజకీయ తీర్మానం పేర్కొంది. దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం రూపకల్పనే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చింది. ఏప్రిల్‌ 4 నుండి 9 వరకూ పార్టీ అఖిలభారత మహాసభ కేరళలోని కోజికోడ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ముసాయిదా తీర్మానంపై సూచనలు,సవరణలను ఆహ్వానించారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, వరదరాజన్‌ ముసాయిదాను విడుదల చేశారు. ' పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని, స్వతంత్ర పాత్రను పెంపొందించాలని తీర్మానం పేర్కొంది. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా దేశంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను అంశాల వారీగా సమీకరిస్తాం. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పర్చాలన్న దీర్ఘకాల లక్ష్యంలో ఇదీ భాగమే ' అని ఈ సందర్భంగా కరత్‌ వ్యాఖ్యానించారు. 2008లో జరిగిన పార్టీ మహాసభ అనంతరం జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ పరిణా మాలను ముసాయిదాలో పొందు పర్చినట్లు చెప్పారు. ముసాయిదాలోని ప్రధాన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. 2007-08లో ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం కొనసాగుతోందన్నారు. ఫలితంగా అమెరికాతో పాటు యూరప్‌లోని పలు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నాయని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ కోతలు, నిరుద్యోగం పెరగడం ఈ దేశాలన్నింటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తోందన్నారు. సంక్షోభం నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఈ కాలంలో అరబ్‌ దేశాల్లోనూ పలు చోట్ల ప్రజాస్వామ్య ఉద్యమాలు పెల్లుబికాయని, ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నాటో రూపంలో అమెరికా కుట్రలు చేస్తోందని వ్యాఖ్యానించారు. 
              లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ వామపక్ష శక్తులు ఈ కాలంలో పుంజుకున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమయ్యేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ' పెట్టుబడి దారీ వ్యవస్థకు ఇక తిరుగేలేదని సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం అన్నారు. ఇప్పుడు ఆ వాదన మసకబారుతోంది. పెట్టు బడిదారీ వ్యవస్థ మనుగడపైనే మేథావు లందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సోషలిజమే అజేయమన్న నినాదానికి ఇప్పుడు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ' అని కరత్‌ వ్యాఖ్యానించారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )  
 

5 comments:

  1. చింత చచ్చినా పులుపు చావలేదన్న మాట! :))

    చెప్పినకథే చెప్పిన చోటే చెప్పుతూ 60ఏళ్ళూగా చెప్పుకొస్తున్నారు. బెంగాల్లో వున్నదీ వూడిందిగా! ఏ స్టేట్లో చూసినా ఏమున్నది గర్వకారణం, లెఫ్ట్ సీట్లన్నీ సింగిల్ డిజిట్ల మించని పొత్తుల పరాయణత్వం.

    ReplyDelete
  2. >>ఏ స్టేట్లో చూసినా ఏమున్నది గర్వకారణం, లెఫ్ట్ సీట్లన్నీ సింగిల్ డిజిట్ల మించని పొత్తుల పరాయణత్వం.

    హ.. హ.. హా..

    హేట్స్ ఆఫ్ టు యువర్ కామెంట్!

    ReplyDelete
  3. పెట్టుబడిదారీ అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు క్రమంగా పతనమవుతున్నది. నిరుద్యోగం పెరిగిపోతున్నది. మార్కెట్‌ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. షేర్‌ మార్కెట్‌ కుప్పకూలింది. భారీ ఆర్థిక సంస్థలు కూడా పేకమేడలా ఒకటి తరువాత ఒకటి కూలుతున్నాయి. ప్రస్తుత శతాబ్దం మొదటి దశాబ్దంలో అంటే 2008 సెప్టెంబరు మధ్యలో తలెత్తిన ఈ సంక్షోభం 1930 నాటి మహా మాంద్యాన్ని తలపింపచేస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదని వాదించిన వారు నేడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన స్థితిలో పడ్డారు. ఇందుకు భిన్నమైన పరిస్థితి సోషలిస్టు శిబిరంలో నెలకొంది. సోషలిస్టు వ్యవస్థ తిరిగి మరింత బలంగా పుంజుకుంటున్నది. సోషలిస్టు వ్యవస్థ పతనమైన గడ్డపైనే కమ్యూనిస్టులు గణనీయమైన శక్తిగా తిరిగి ఎదుగుతున్నారు. చైనా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వేగవంతమైన పురోభివృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదగగలదని భావిస్తున్నారు. సోషలిస్టు క్యూబా ప్రపంచంలో అతి పెద్ద సైనిక, ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రశంసనీయమైన అభివృద్ధి రేటును సాధించింది. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో వామపక్ష భావాలు గల పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి.
    మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలలో వామపక్షపార్టీలు మళ్ళీ పూంజుకుంటాయి. అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూన్నాయి. మరింత ముందుకు పోవడాని ఆ దిశలో ప్రయత్నాలే ఈ మహాసభలు.

    ReplyDelete
  4. స్పందనలు తెలియజేసినందుకుమీకందరికి కృతజ్ఞతలు.

    ReplyDelete