Wednesday, March 6, 2013

అరుణతార ఛావేజ్‌ ఇకలేరు...

అరుణతార ఛావేజ్‌ ఇకలేరు...


                           కమ్యూనిస్ట్ యోధుడు, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ ఇక లేరు. కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కరాకన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 58 ఏళ్ల చావెజ్‌ క్యాన్సర్‌ వ్యాధికి కీమో చికిత్స తీసుకున్నారు. అంతుచిక్కని పెల్విస్‌ కేన్సర్‌తో బాధపడుతున్న చావెజ్‌ ఇప్పటికి నాలుగుసార్లు క్యూబా రాజధాని హవానాలో సర్జరీ చేయించుకున్నారు.
                      1954 జులై 28న జన్మించిన చావెజ్ 1999 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వెనిజులాలో అమెరికా పెత్తనానికి స్వస్తిపలికి సోషలిజానికి పట్టం గట్టిన ఘనత చావెజ్‌దే. సంక్షేమమే తన ధ్యేయమని చాటి దాన్ని అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేశాడు. తన సంస్కరణలతో వెనెజులా వాసుల హృదయాలతో పాటు అమెరికా పెత్తనానికి వ్యతిరేకించే వారందరి హృదయాల్ని గెలుచుకున్నాడు. అటువంటి చావెజ్ క్యాన్సర్‌ని జయించలేక కన్నుమూశారు. అభిమాన నేత మరణాన్ని వెనిజులావాసులు శోకసముద్రంలో మునిగిపోయారు.

                 వెనిజుల్లా అధ్యక్షుడు హూగో చావెజ్ మృతికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు. వెనిజుల్లా గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని అన్నారు .చావెజ్ అత్యంత జనాకర్షణ కలిగిన ఉన్న నేత అని ప్రధాని సంతాప ప్రకటనలో తెలిపారు. వామపక్ష సిద్దాంతాలతో సామాజిక న్యాయం జరిగేలా పోరాటం చేసిన నాయకుడు అని అన్నారు.

No comments:

Post a Comment