చంద్రశేఖర్ వెంకట రామన్ (సి.వి.రామన్) ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జపుతారు. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, రువైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా నిలిచారు. కేంద్రప్రభుత్వం భారతరత్న బహుకరించింది.
మానవ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన వాటిలో శాస్త్ర సాంకేతిక రంగాలది ప్రథమస్థానం. సామాజిక జీవన ప్రమాణాల్ని, ఆర్థిక సంబంధాల్ని, సాంస్కృతిక నియమాల్నే గాక ప్రకృతి, భౌతిక ప్రపంచం గురించిన తాత్విక పరిజ్ఞానానికి శాస్త్రీయ పునాదిని కూడా శాస్త్ర సాంకేతిక రంగాలే సమకూర్చాయి.
స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వయంపాలన, స్వయంప్రతిపత్తి వంటి వాదనలు బలపడుతున్న స్థితిలో ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆయుధ సంపత్తితో, పెద్దయెత్తున వినాశకర అణ్వాయుధాల తయారీకి, ఆధునిక రహస్య గూఢచర్యం కోసం వాడుతూ ఈ శక్తులు సౖన్సును దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ శాస్త్రసాంకేతిక సంపత్తిని గుప్పెట్లో పెట్టుకున్నాయి. సోషలిస్టు ఉత్పత్తి పద్ధతుల్ని దెబ్బతీసేందుకు ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అనే త్రిముఖ వ్యూహంతో ప్రపంచదేశాల్ని శాసించాలని, ప్రపంచ క్రమాన్ని, పాలనా పద్ధతుల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాయి.
విప్లవాత్మకమైన రీతిలో ఖగోళ పరిజ్ఞానం, జీవశాస్త్ర పరిజ్ఞానం, కంప్యూటర్ రంగం, పాదార్థిక విజ్ఞానం అభివృద్ధి చెందిన సమయం కూడా అదే! అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక రంగాలకున్న సహజ ప్రవృత్తి ప్రజల్ని మేల్కొలపడం, వారిలో ఆధునిక చైతన్యాన్ని తీసుకురావడం. మానవ చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రగతిశీల పాత్రను పోషించాయి. కానీ ప్రజల్ని అంధకారంలో ఉంచి పబ్బం గడుపుకొనే శక్తులకిది సమ్మతం కాదు. పరమత ద్వేషం, అశాస్త్రీయత, మూఢనమ్మకాలు, స్వోత్కర్ష, కుహనా శాస్త్రమనే పునాదుల మీదే మతశక్తులు మనగగలవు.
ప్రజల దైనందిన అవసరాల ప్రాముఖ్యత కన్నా విలాస వస్తువుల తయారీ, వినియోగతత్వాన్ని పోషించే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ ప్రధాన రంగాలయ్యాయి. వ్యవసాయం, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణంలో కూడా ఆటోమేషన్ రావడంతో ప్రకృతి వనరులు హరించుకుపోతున్నాయి. జీవ సమతుల్యం, వనరుల సమతుల్యం దెబ్బతినడంతో పాటు, పర్యావరణ కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. నూతన ఆర్థిక పారిశ్రామికీకరణ పద్ధతులు అమల్లోకి వచ్చాక ఆబగా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడంతో పాటు శత్రు వినాశనానికి వీలు కల్పించే రసాయనిక, క్రిమి ఆయుధాల తయారీ పరాకాష్టకు చేరుకుంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఎయిడ్స్ వ్యాధి వంటివి యుద్ధోన్మాదుల ప్రాయోజిత ప్రయోగాల ఫలితాలేనని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి.
అటువంటి సంధి దశలో ప్రజలపక్షాన నిలిచే అభ్యుదయశక్తులు, ప్రభుత్వేతర సంస్థలు ఐక్యమై బలమైన ప్రజాసైన్సు ఉద్యమాన్ని చేపట్టవలసిన చారిత్రిక అవసరమేర్పడింది. ప్రజల్లో అశాస్త్రీయపుటంధకారం నుంచి వైజ్ఞానిక వెలుగువైపు నడిపించేందుకు, శాస్త్ర సాంకేతిక రంగాల్ని ప్రజాబాహుళ్యపు సమిష్టి ప్రయోజనాలకు సాధనాలుగా మార్చే ప్రక్రియకు బలాన్ని జోడించేందుకు ప్రజాసైన్స్ ఉద్యమ అవసరం ఏర్పడింది. ఆ స్ఫూర్తితో 1988 ఫిబ్రవరి 28న పురుడుపోసుకున్న 'జనవిజ్ఞాన వేదిక' కూడా తన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టి, రజతోత్సవం జరుపుకుంటున్నది.
No comments:
Post a Comment