Thursday, June 6, 2013
Saturday, June 1, 2013
Tuesday, May 28, 2013
తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు...
భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహా నటులున్నారు.వారందరూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కానీ ఏ నటుడు నటించనీ, చేయలేని పాత్రలు చేసిన ఏకైక నటుడు నందమూరి తారకరామారావు. వందేళ్ళ సినీ చరిత్రలో ఆయనదో చరిత్ర.
మే 28 ఎన్‌టి.రామారావు పుట్టినరోజు.
Monday, May 27, 2013
Monday, May 6, 2013
Wednesday, May 1, 2013
ప్రతిధ్వనించిన రోజు ... mayday
శ్రామికులందరూ ఆనందంతో జరుపుకునే పండుగ రోజు 'మేడే'!
మేడే కార్మికవర్గానికి స్ఫూర్తినిచ్చేరోజు.
ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళలు అర్పించేరోజు.
కార్మికవర్గం తమ పోరాటాలను సమీక్షించుకొని ముందడుగు వేసేరోజు.
తమను దోపిడీకి గురి చేసే పెట్టుబడిదారీ విధానం అంతం కోసం ప్రతిఙ్ఞ చేసే రోజు.
ఇప్పటికి 127 ఏళ్ళ క్రితం మే 1వ తేదీన ప్రారంభమైన కార్మికోద్యమాన్ని అణచాలని పెట్టుబడిదారీవర్గం అనుకుంటే అది ప్రపంచ మంతా అల్లుకుంది. ఆ రణన్నినాదం దేశ దేశాలను చుట్టుముట్టింది. 1889లో ప్యారిస్‌లో జరిగిన రెండో అంతర్జా తీయ కార్మికసంఘం ప్రథమ మహా సభ ప్రతి మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని తీర్మా నించింది. ఎనిమిది గంటల పని దినం, ప్రజాస్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించా లని నిర్ణయించింది. 1917కు కార్మికవర్గం సోవియట్‌లో రాజ్యాధికారానికి వచ్చిన తరువాత ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని చట్ట బద్ధంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇది కార్మికులు సాధించిన విజయం. చరిత్ర మర్చిపోని ఈ అధ్యాయాన్ని స్మరించి, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడమే శ్రమ జీవుల కర్తవ్యం.
అందరికీ 'మేడే' శుభాకాంక్షలు!
Subscribe to:
Posts (Atom)







