Tuesday, July 31, 2012

భాగ్యనగరానికి మరో కీర్తి...


భాగ్యనగరానికి మరో కీర్తి...
లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ చేసినా హైదరాబాదీ షూటర్‌ గగన్‌ నారంగ్‌ కు శుభాకాంక్షలు.  మన క్రీడాకారులు మరిన్ని పతకాలు తేస్తారని అశిస్తూ...


( ఈనాడు సౌజన్యంతో..... )

Sunday, July 22, 2012

నేత్రదానం చేద్దాం...మరో జీవితంలో వెలుగులు నింపుద్దాం...



నేత్రదానం చేద్దాం...మరో జీవితంలో వెలుగులు నింపుద్దాం...

మనం కూడా ప్రయత్నం చేద్దాం.

Friday, June 22, 2012

వేడి వేడిగా చల్లచల్లగా...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్టణం ,  సింహాచలం,  ఆరకు లోయ,  బొర్రా గుహలు,  తిరుపతి,  శ్రీకాళహస్తి,  తమిలనాడు రాష్ట్రం వెల్లుర్ పట్టణంలోని గొల్డెన్ టెంఫుల్ ... మే 28 నుండి జున్ 3 వరకు    ముడు స్నేహితుల కుటుంబలతో  వెల్లివచ్చాం.  విశాఖపట్టణంలొ, గొల్డెన్ టెంఫుల్ ల దారి లో  వేడిని  భారించలేకపోయాం.   తిరుమల, బొర్రా గుహలు  చాలా ఆసక్తికరముగా,  ఆహ్లాదకరముగా చల్లచల్లగా ఉంది.  పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు.  మా టూర్  వేడి వేడిగా చల్లచల్లగా  జరిగింది.
విశాఖపట్టణం లో చూడదగిన ప్రదేశాలు :


   1. సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.  2. రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విశాలత తగ్గింది. కొద్దిగా  కాలుష్యంగా ఉంది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే జలాంతర్గామి ( కల్వారి ) మ్యూజియం (భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు ) ఉన్నాయి. 3. కైలాసగిరి- శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి కొండమీద.  4. వైజాగ్ స్టీలు ప్లాంటు. చాలా  పెద్దది.  చూడటానికి కనిసం 8 గంటలు వాహనం ద్వార పడుతుంది.   5. రిషికొంద బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో వున్నది.  ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.  6. భ్మిలీ బీచ్ - నగరానికి  28కి.మీ దూరంలో వున్నది.  తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.  7. జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు    8.విశాఖ నౌకాశ్రయము,  విశాఖపట్నం చేపలరేవు 9.ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విద్యా కళా పరిషత్)    10. రామనాయుడు స్టూడియో   సముద్ర తీరంలో కొండ మీద  వుంది.         
విశాఖపట్టణంలొ వేడిని  భారించలేకపోయాం. దానితో రెండు రొజులు బీచ్ లలో ఎంజయ్ చేశాం. పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు. 

అరకు  : ఆరకు లోయ సముద్రమట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 115 కి.మి.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో , కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.  విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి.  ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్ , ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు,  వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లొ ఉదయం 6.50 కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి. అది అలా కొండలు , లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ఫ్రయాణం లొ "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది. అది భారతదేశంలొ అతి ఎత్తులొ వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు. ఇక వెళ్లే దారిలొ బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణం లో చూడవచ్చు. దారిలో అనంతగిరి కొండల లో కాఫీ తోటలు ఉన్నాయి. అరుకులొ వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు,  ట్రైబల్ కాటేజీలు వుంటాయి .  

Thursday, June 14, 2012

యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే  రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి   నేటికీ ఆదర్శం.   
ప్రపంచంలో ఎకడచుసినా  నీ రూపం...

ఏ   కీ చైన్  చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...  

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

             చే గెవారా   దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు.  రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ  వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
              అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో
చే జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు.  విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు
          
1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు. చే గెవారా  అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా.  గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు.
                ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు  చే  పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే  క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.

             
 ప్రపంచంలో ఎక్కడ  అన్యాయం జరిగినా 
                          ఎదురించడానికి  సిద్దంగా ఉండు - చే  
 
(నేడు చేగువేరా  జయంతి)

Saturday, May 19, 2012

మహా మనిషి, ఆదర్శ జీవి...

ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు.
               నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.   దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు.  సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.  తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
             ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది.  రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.  పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.
                                    కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. "కామ్రేడ్ పి.ఎస్." అని ఈయనను పిలిచేవారు. మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని  ఆనాడే  సుందరయ్య గారూ   పిలుపునిచ్చారు.
                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు.

     సుందరయ్య,   
    నీలాంటి త్యాగజీవులెందరయ్యా  ,    
    శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు మహా మనిషి  సుందరయ్య గారి  27వ వర్థంతి  సందర్బంగా  )

Sunday, May 6, 2012

నవ్వడం నలభై విధాలగ్రేట్‌ ...

నవ్వడం ఒక యోగం...నవ్వించడం ఒక భోగం...నవ్వలేకపోవడం ఒక రోగం...అని జంధ్యాల చెప్పిన మాటలు ఎన్ని తరాలు మారినా నిత్యసత్యాలే. అవును మరి నవ్వు అనేది ప్రతిమనిషిజీవితంలో అంతటి ప్రాముఖ్యతను సంపాదించుకుంది. నవ్వు నాలుగు విధాలచేటు అనే నానుడి కాస్తా నవ్వడం నలభైవిధాలగ్రేట్‌ అన్నవిధంగా మారిందంటే అతిశయోక్తికాదు. అందుకే నవ రసా ల్లో హస్యా నికి ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా లాఫింగ్‌ క్లబ్‌లు ఏర్పాటుచేయడమే కాకుండా ప్రతి సంవత్సరం మేనెల మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు మన హాస్య ప్రియులు.

            నవ్వుల క్లబ్‌ ఉద్యమం ప్రస్తుతం 65దేశాల్లో విస్తరించింది. ఆరోగ్యం ,ఆనందం, విశ్వశాంతికోసం జాతి మతాలకు అతీతంగా అనేక నగరాల్లోనూ, రెండవశ్రేణి పట్టణాల్లో సైతం నవ్వుల క్లబ్‌లు ఏర్పాటుచేస్తూ వారానికి ఒక్కరోజైనా కలిసి నవ్వుల్ని పంచుకుంటున్నారు. చిన్నా పెద్దా , ధనిక పేద, ఆడమగ తేడాలేకుండా అంతా కలిసి నవ్వుల పండుగ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పదికాలలపాటు నవ్వుల సాక్షిగా కాపాడుకుంటున్నారు. జాతిమతం, ప్రాంతం, దేశంతో సంబంధంలేకుండా ప్రతి మనిషికి అర్థమయ్యే భాష నవ్వు. మనకు తెలియకుండానే వచ్చే నవ్వు... మనం నవ్వాలన్నా ప్రయత్నించినా మనసారా నవ్వ డం లేదని ఇట్టే తెలిసిపోతుంది. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మన సారా నవ్వుతున్నాడో తెలుసుకుంటే చాలు.
            శరీరంలో సహజరోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్తరైటిస్‌, స్పాండు లైటిస్‌, మైగ్రిన్‌ వంటి వ్యాధులు దూరమవుతాయి. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు ఎక్కువ సామర్ధ్యంతో పనిచేస్తారని మరో అధ్యయనంలో స్పష్టమైంది.  హాయిగా నవ్వేలా చార్లీచాపీన్‌ సినిమా చూడండి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పువ్వల్లే... నవ్వుల్‌...నవ్వుల్‌...అని హామింగ్‌ చేస్తూ ...నవ్వుతూ బతకండి...
( అంధ్ర ప్రభ  సౌజన్యంతో..... )

Saturday, May 5, 2012

కార్మికుల సుదీర్ఘ పోరాట ఫలం...

సోషలిజం దిశగా తొలి అడుగు : ఛావెజ్‌ 
వెనిజులాలో కొత్త కార్మిక చట్టం

                అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ సంతకం చేసిన నూతన సమగ్ర కార్మిక చట్టం వెనిజులాలో సోషలిజం దిశగా మార్పులో తొలి అడుగని ఆ దేశ ప్రభుత్వం అభివర్ణించింది. ఈ చారిత్రిక పత్రంపై సంతకాలు చేసిన సందర్భాన్ని జరుపుకునేందుకు మేడే రోజున వేలాది మంది రాజధాని వీధుల్లో ప్రదర్శన జరిపారు. 'దీర్ఘకాలిక ప్రతిఘటన, పోరాటం, ఇంకా చెప్పాలంటే ఇబ్బందుల క్రమం లేకుండా ప్రజలు, కార్మికులు ఎన్నడూ విజయం సాధించలేదు. ఇప్పుడు నేను సంతకం చేసే గౌరవాన్ని అందించిన ఈ చట్టం కూడా సుదీర్ఘ పోరాట క్రమం ఫలితమే' అని అధ్యక్షుడు ఛావెజ్‌ చెప్పారు. ఈ కొత్త చట్టం ప్రకారం పనిని వారంలో 40 గంటలకు తగ్గిస్తుంది. 1990ల నుంచి సాగిన నయా ఉదారవాద విధానాల దోపిడీ రూపంగా భావిస్తున్న దేశంలోని ప్రయివేటు సబ్‌ కాంట్రాక్టు లేబర్‌ను రద్దు చేస్తుంది. ప్రసవానంతర సెలవును 12 నుంచి 25 వారాలకు పెంచడం, బిడ్డ పుట్టిన అనంతరం రెండేళ్ళ పాటు డిస్మిస్‌ కాకుండా నూతన దంపతులను కాపాడటం ద్వారా పని ప్రదేశంలో జండర్‌ సమానత్వం దిశగా ఇది గొప్ప ముందడుగని మహిళా గ్రూపులు ఈ చట్టాన్ని ప్రశంసించాయి.
                 1997లో అప్పటి రఫాయెల్‌ కాల్డెరా ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, కార్పొరేట్‌ ప్రయోజనాల ఒత్తిడికి తలొగ్గి రద్దు చేసిన కొన్ని కార్మిక హక్కులను ఈ చట్టం తిరిగి కల్పిస్తుంది. ఈ చట్టాన్ని అనుసరించి కార్మికుడు చివరి నెలలో తీసుకున్న జీతాన్ని అతడు సేవలందించిన సంవత్సరాల సంఖ్యతో గుణించడం ద్వారా కార్మికుల రిటైర్మెంట్‌ బోనస్‌ను తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు ఎవరైనా కార్మికుడ్ని యజమాని అక్రమంగా తొలగిస్తే బోనస్‌గా రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 12 నెలల్లో అమలు చేయాల్సి ఉన్న ఈ కొత్త చట్టాన్ని యజమానులు ఏ మేరకు అమలు చేస్తున్నారనే విషయాన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కార్మికులు రిటైరైన తరువాత తమ ప్రయోజనాలను ఒక ప్రయివేటు బ్యాంక్‌, ప్రభుత్వ బ్యాంక్‌ లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ రిటైర్మెంట్‌ నిధి ద్వారా తమకు ఏది ఇష్టమైతే అందులో ప్రాసెస్‌ చేసుకునేందుకు అవకాశముంది. ఛావెజ్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో నెలవారీ కనీస వేతనాన్ని 32.5 శాతం పెంచుతూ ప్రకటించారు. దాన్ని రెండు దశలుగా అమలు చేస్తున్నారు. మొదటి దశ మే 1 నుంచి 1,548 బొలివార్ల నుంచి 1,780 బొలివార్ల పెంపుదలతో అమలులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో 2,047 బొలివార్లలో 15 శాతం పెంపుదల వస్తుంది. ఈ నూతన చట్టం సోషలిజపు అత్యున్నత దశ నిర్మాణానికి సాధనమని విదేశాంగ మంత్రి నికొలస్‌ మదురా పేర్కొన్నారు. నాల్గింట ఒక వంతు మంది నిరుద్యోగులుగా ఉన్న స్పెయిన్‌లోని కార్మిక వ్యతిరేక చట్టాలకు ఇది పూర్తిగా భిన్నమైందని అన్నారు. వెనిజులా శాసన నిర్మాతలు దాదాపు మూడేళ్ల నుంచి కార్మిక సంస్కరణలపై చర్చిస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తానని ఛావెజ్‌ వాగ్దానం చేసిన గత నవంబర్‌ నుంచి అవి వేగం పుంజుకున్నాయి. 'దోపిడీతో కూడిన పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల నుంచి ఎలాంటి దోపిడీ లేని సోషలిస్టు ఉత్పత్తి సంబంధాల దిశగా కదలాలనే మా ఆకాంక్షను పునరుద్ఘాటిస్తున్నాం' అని వెనిజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పెడ్రో యూస్సే చెప్పారు. ఈ చట్టానికి 80 శాతం మంది వెనిజులా ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ పోలింగ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ వివరించింది. 
( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )