Showing posts with label సామాజికోద్యమ నేతలు.... Show all posts
Showing posts with label సామాజికోద్యమ నేతలు.... Show all posts

Thursday, April 11, 2013

సామాజికోద్యమ చైతన్య జ్వాల ...



               సామాజికోద్యమ చైతన్య జ్వాల జ్యోతిరావుబాఫూలే. నేడు మహాత్మ జ్యోతిరావు బాపూలే జయంతి. జయంతిని దేశ ప్రజలు ఏప్రెల్‌ 11న జరుపుకుంటారు. దేశంలో రాజ్యాధికారం హస్తగతం చేసుకుని పెత్తందారి విధానాలతో కులాలను విడగొట్టి బ్రాహ్మణ ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రకులాలపై యుద్ధం ప్రకటించారు ఫూలే. కులమత ఆధిపత్యాలను చీల్చి చెండాడిని సామాజిక విప్తవయోధుడాయన. మహాత్మా జ్యోతిరావు బాఫూలే 1827 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో ఉన్న 'సతారా'లో 'మాలి' అనే శూద్రకులంలో జన్మించారు. ఆయనకు 1840లో సావిత్రి బాపూలేతో బాల్య వివాహం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌లో అగ్రకుల పెత్తందారీ తనాన్ని, బ్రాహ్మణ కులవ్యవస్థ నుంచి ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్య్రాలను కల్పించలేని ఆపార్టీ ప్రవచించే జాతీయ వాదానికి అర్థం లేదని చెప్పారు. 1873లో 'గులాంగిరి' అనే గ్రంధాన్ని ప్రచురించి ప్రాచుర్యం పొందారు. బ్రాహ్మణులు సాగించిన అన్యాయాలను, అంటరాని తనాన్ని, వివక్ష రూపాలను, అణచివేతను గులాంగిరి గ్రంథంలో ఆయన సమగ్రంగా వివరించారు. నిచ్చేన మెట్ల సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న క్లిస్ట సమస్యలను 'తృతీయరత్న ' నాటకంలో కళ్లకుగట్టినట్లు వివరించారు. కుల, మత ఆగడాలను తన రచనల ద్వారా ప్రచారం చేశారు. దళిత కౌలు రైతులు మౌలిక సమస్యలను అధిగమంచేందుకు , మెలుకువలు తెలిపేందుకు పూలే క్షేత్రస్థాయిలో దర్శించారు.
                 ఇల్లాలి చదువు -ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను అనేనినాదంతో బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆయన భార్యకు విద్యను నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయినిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశారు. ''సత్యశోధక సమాజ్‌'' అనే సంస్థద్వారా ఆధిపత్య కులాల సాంస్కృతిక భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేశారు. ఆయన చేసిన చేవలను గుర్తించి ఆనాటి సమాజం ఆయనకు 1888లో 'మహాత్మా ' అని బిరుదు పొందారు. వృద్ధాప్యంలో చేతిలో చిల్లిగవ్వలేకుండా జీవించారు.
              1889లో అక్టోబర్‌లో అస్వస్థతకు గురయి అదే ఏడాది నవంబర్‌28న తుదిశ్వాస వదిలారు.

Tuesday, December 6, 2011

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అశయ సాధనకు కృషి ఎక్కడ.......

భారత రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్య్రోద్యమ నాయకులు, భారత తొలి న్యాయ శాఖా మంత్రి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం కృషి ఎక్కడ వుంది. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆశాలను తుంగలో తొక్కుతున్నాయి. నాయకుల వర్ధంతులు, జయంతుల సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి గణంగా నిర్వహించాము అని చెపుకోవడానికి మాత్రమే సరిపోతున్నది. ట్యాంక్‌బండ్‌ క్రింద వున్న డా|| అంబేద్కర్‌ భవన్‌లో గత కొంత కాలంగా కరెంటు లేక చీకటిమయంగా వుంది.  దాని ఆలన, పాలన చూస్తే నాదుడు లేడు. సాంఘీక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఏ.పి.స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుండి దాదాపు 400 మంది ఐఏఎస్‌,ఐపిఎస్‌ తదితర.....అధికారులను ఇచ్చిన ఘనత ఈ స్టడీ సర్కిల్‌కు వుంది. ఇపుడు ప్రభుత్వం పట్టిచుకోక నిధుల కొరతతో త్రీవ సంక్షోభంలో వుంది. శిక్షణ కార్యక్రమాలు జరగడం లేదు. ఇకా మూతపడే దశకు చేరుకుంది. దళితులకు, బలహీన వర్గాలకు, పేదల అభివృద్ధికి, ప్రజ సంక్షేమము కోసం కృషి చేస్తున్నాము అని చేపుకొనే నాయకులకు ఇవ్వన్ని కనబడవా ?
 
                   ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలె. దేశంలో,  మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఈ పాశవిక సంఘటనలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా, పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు.  శ్రీకాకుళం జిల్లా దళతున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు  ఒక తండ్రి.
                అంబేద్కర్ ఆలోచనలు ఈనాడు ఎంతగా వ్యాపించినా, బలపడినా - దేశంలో ఇంకా దళితులపై అత్యాచారాలు, హత్యలు  జరుగుతూనే ఉన్నాయి,   దళితులు,  బలహీన వర్గాలు  అవమానాలకు గురి అవుతున్నారు. దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతున్నది.
               అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా  ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా  ముందుకు  రావాలని  కొరుకుంద్దాం.        
డాక్టర్‌ భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌ గారు 1956 డిసెంబర్‌ 6న మరణించారు.
                             ( నేడు ఆయన వర్ధంతి సందర్భంగా...)