Showing posts with label తెలుగు సాహిత్యం.... Show all posts
Showing posts with label తెలుగు సాహిత్యం.... Show all posts

Tuesday, February 21, 2012

దేశభాషలందు తెలుగు లెస్స...

                           అందరికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...

భాషలన్నింటిలో మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.శిశువు మొట్టమొదట నేర్చుకునే భాషే తల్లిబాష. శిశువు సహజరీతిలో నేర్చుకొనే భాష 'మాతృభాష'. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతీయ భాష మాతృభాష అవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగును దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు.


              భారత రాజ్యాంగంలోని 345 అధికరణం ప్రకారం ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమిచ్చింది. 1966లో ఆంధ్రప్రదేశ్‌ శాసనవిభాగం అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది. త్రిభాషా సూత్రాన్ని కూడా ప్రతిపాదించారు. మాతృభాష తెలుగును ప్రథమ, జాతీయ బాష హిందిని ద్వితీయ, ఆంగ్లబాషను తృతీయ భాషలుగా ప్రతిపాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్‌ తరగతులకు తెలుగును బోధ భాషగా ప్రవేశపెట్టింది. 1971లో డిగ్రీ కళాశాల జరగాలని నిర్ణయించారు.

నేడు  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా. (ఫిబ్రవరి 21)

Monday, December 12, 2011

సహజ కవి '' మల్లెమాల '' ఇకా లేరు...

ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ సినీనిర్మాత... మల్లెమాల గారు ఇకా లేరు. సినిమా రంగంలో 'మల్లెమాల'గా సుపరిచితులైన  ఎమ్మెస్‌ రెడ్డి (87).  ఆయన పూర్తిపేరు మల్లె మాల సుందరరామిరెడ్డి
                సమాజంలోని అన్యాయాలను, దురాగతాలను చూపి చలించిపోయిన మానవతా మూర్తి. అద్భుతమైన పాటలను సినమాలకు, తెలుగు సాహితీ ప్రపంచానికి అందించారు. అదే సమయంలో సామాజిక స్ప ృహతో విప్లవ గీతాలు, కవితలు రచించారు.         
                 స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీజి ప్రసంగానికి ప్రభావితుడై, వారిని కలిసి ఆయన బాటలో అంటారాని తనాన్ని నిమ్ములించాలని అహర్నిశలు కృషి చేశారు. సమతా, మమతల బావనతో ఎన్నో కవితలను రచించారు. పశ్చిమబెంగాల్‌ కరువు వచ్చినపుడు 'కష్టజీవి' బుర్రకథని తోటివారితో కలిసి ప్రదర్శించి వచ్చిన డబ్బులను బెంగాల్‌ పంపినారు. ఎనో సినిమాలను రూపొందించారు. 'అంకుశం' సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో సహజ నటనతో కనిపించారు.            
          సహజ కవి, ఆంధ్రా వాల్మీకి, అభినవ వేమన...బిరుదులు, జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
                'మల్లెమాల' రాలిపోయింది. సుమధుర గీతం ఆగిపోయింది.

Sunday, December 11, 2011

మిత్రులకు, బంధువులకు తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు ....

హాలో ఫ్రెండ్‌..
తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు ....
ఈ బీజి ప్రపంచంలో ఏవరి పని వారికి. ఏవరి బీజి వారికి ఉంటుంది. తెలుగు వారి కోసం పది నిముషాలు కెటాయిస్తే మనకు తెలిసి ఒక మంచి విషయాన్ని పది మందికి తెలియజేసిన వారిగా, వారికి సహాయాన్ని, సహకారాన్ని అందిందిచన వారం అవుతాం. నేటికి తెలుగులో దాదాపు 4500 బ్లాగులు మాత్రమే ప్రపంచంలో వున్నాయని తెలుసు. అంటే దీనిని బట్టి తెలుగు పరిస్థితి అర్ధం అవుతుంది. నేను చిన్న ప్రయత్నంగా మిత్రులకు, బంధువులకు తెలియజేసి, ప్రోత్సహించి కొన్ని బ్లాగులను ప్రారంభింపజేశాను.
మనం మన వంతుగా కృషిగా విలైనపుడు మాతృభాష అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వ్యాప్తికి కృషి చేద్దాం...

మరో సారి తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలతో   ....

( నేడు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా...)

Wednesday, November 30, 2011

తెలుగు సాహితీ జగత్తులో ఒక ధృవతార ....

      తెలుగు సాహితీవేత్తల్లో అగ్రగణ్యులు గురజాడ వెంకట అప్పారావు. అభ్యుదయ సాహిత్యాన్ని సృజించి, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న మహౌన్నతుడు. సాహిత్యమనేది సామాజిక అభ్యున్నతికి, సంఘ సంస్కరణకు దోహదపడాలన్న ఉదాత్త ఆశయం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సామాజిక దురాగతాలపై పోరాటమే సాహిత్యం లక్ష్యమని ప్రగాడంగా విశ్వసించిన నవయుగ వైతాళికుడు.
'' దేశమంటే మట్టికాదోయి
... దేశమంటే మనుషులోయి '' అంటూ సమాజానికి చాటి చెప్పినారు. సంఘ సంస్కరణ కోసం కలం పట్టారు. ప్రధానంగా అంశాలుగా స్త్రీ జనోద్ధరణ, మూడనమ్మకాలు ఎంచుకోన్నారు. ఆయన సంఘసంస్కర్త. చదువు వల్ల సమకూర్చుకున్న విజ్ఞానాన్ని జనులకు పంచిపెట్టేవారు.
            కన్యాశుల్కం నాటకం చాలా అద్భుతం. వాస్తవిక జీవితం నుండి సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు వాడుక బాషలో 1892 లో కన్యాశుల్కం నాటకాన్ని రాశారు. వేలలాది ప్రదర్శనలిచ్చిన ఇచ్చారు. వందల సంవత్సరాలు దాటినా విశేష జనాదరణ పొందుతున్న నాటకం కన్యాశుల్కం. జాతీయ భాషల్లోనే కాకుండా ఇతరల దేశాల బాషల్లో కూడా అనువదితమైంది. ఆనాటి సమాజంలో బాల్యవివాహలే ప్రధాన ప్రేరణ. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్ళి పేరిట అమ్ముకోవటాన్ని గురజాడ తీవ్రంగా నిరసించారు.
                  గురజాడ కలం నుంచి రచనలు ఎన్నో... ఆయన రచించిన దేశభక్తి గేయాలు అందరికి నవ ఉత్తేజాన్ని నింపాయి. ప్రగతిశీల భావాలు కలిగిన అభ్యుదయ రచయితలకు, వ్యక్తులకు కాదు అందరికి ఉత్సహన్ని ఇచ్చాయి. సామాజిక దురాచారాలను నిరసిస్తూ నైతిక ప్రమాణాల వ్యాప్తి చేయటంమే సాహిత్య కర్తవ్యం అని విశ్వసించినవారు.వారి రచనలు స్ఫూర్తిదాయకం.
                   గురజాడ వెంకట అప్పారావు రాయవరం గ్రామం, ఎలమంచిలి తాలూకా, విశాఖపట్నం జిల్లా లో 1862 సెప్టెంబర్‌ 21 జన్మించారు.
ఆయన కలం అలసి సొలసి పోయి 
ఆయన 97వ సం||లో  1915 నవంబర్‌ 30న కన్ను మూశారు. 
( నేడు వారి వర్థంతి సందర్భంగా....)