Showing posts with label దినోత్సవాలు.... Show all posts
Showing posts with label దినోత్సవాలు.... Show all posts

Friday, June 14, 2013

ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా...

ప్రపంచ విప్లవకారుడు చేగువేరా.

  చేగువేరా 1928, జూన్‌ 14న అర్జెంటీనాలో జన్మించారు. వైద్యవిద్యను పూర్తి చేసి లాటిన్‌ అమెరికా దేశాల్లో అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. క్యూబా గెరిల్లా పోరాటంలో చేరి విప్లవోద్యమానికి అంకితమయ్యారు. క్యూబాలో విప్లవం జయప్రదం అయిన తర్వాత మంత్రి పదవిని సైతం వదిలి బొలీవియాలోనూ ఉద్యమించడానికి బయలుదేరారు.
 ఆయన చేసిన పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాతంత్ర వాదులకు, యువతకు సమాజ మార్పును కోరే అందరికీ ఆదర్శప్రాయం.  ప్రజలకే చెగువేరా జీవితాన్ని అంకితమిచ్చారు. చెగువేరా స్ఫూర్తితో ప్రస్తుతమూ అమెరికా సామ్రాజ్యవాదానికి, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం. 

 చేగువేరా 85వ జయంతి

Wednesday, May 1, 2013

ప్రతిధ్వనించిన రోజు ... mayday



'ప్రపంచ కార్మికులారా! ఏకం కండీ  అంటూ ప్రతిధ్వనించిన రోజు  
 శ్రామికులందరూ ఆనందంతో జరుపుకునే పండుగ రోజు  'మేడే'!


మేడే కార్మికవర్గానికి స్ఫూర్తినిచ్చేరోజు.
ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళలు అర్పించేరోజు.
కార్మికవర్గం తమ పోరాటాలను సమీక్షించుకొని ముందడుగు వేసేరోజు.
తమను దోపిడీకి గురి చేసే పెట్టుబడిదారీ విధానం అంతం కోసం ప్రతిఙ్ఞ చేసే రోజు.

               ఇప్పటికి 127 ఏళ్ళ క్రితం మే 1వ తేదీన ప్రారంభమైన కార్మికోద్యమాన్ని అణచాలని పెట్టుబడిదారీవర్గం అనుకుంటే అది ప్రపంచ మంతా అల్లుకుంది. ఆ రణన్నినాదం దేశ దేశాలను చుట్టుముట్టింది. 1889లో ప్యారిస్‌లో జరిగిన రెండో అంతర్జా తీయ కార్మికసంఘం ప్రథమ మహా సభ ప్రతి మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని తీర్మా నించింది. ఎనిమిది గంటల పని దినం, ప్రజాస్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించా లని నిర్ణయించింది. 1917కు కార్మికవర్గం సోవియట్‌లో రాజ్యాధికారానికి వచ్చిన తరువాత ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని చట్ట బద్ధంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇది కార్మికులు సాధించిన విజయం. చరిత్ర మర్చిపోని ఈ అధ్యాయాన్ని స్మరించి, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడమే శ్రమ జీవుల కర్తవ్యం.

  అందరికీ 'మేడే' శుభాకాంక్షలు!

Saturday, September 29, 2012

మన గుండె. మన చేతుల్లో...


గుండె లబ్-డబ్ అనేది మన జీవన నాదం.
గుప్పెడంత గుండె మన ప్రాణానికి మూలం. 
అది నిర్విరామంగా కొట్టుకుంటేనే మనకు జీవితం.
మానసిక, శారీరక సమస్యలకు గుండె ఆరోగ్యానికి  సంబందం ఉంది. 
మన అనందమయ జీవితానికి  గండె  ఆరోగ్యం  ఎంతో ముఖ్యం.    

మన జీవన విధానం లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దానిని అదుపులో పెట్టవచ్చు.

1. పొగ త్రాగటం మానండి. పొగాకు వాడే ఉత్పత్తులను వాడకండి.
2. ఆల్కహాల్ సేవించడం మానండి.
3. ప్రతి రోజు తప్పనిసరిగా 30 నిముషాలు వ్యాయామము(నడక, పరుగు...) చేయడం అలవాటు చేసుకోండి.
4. మధుమేహం, బరువు,  రక్తపోటు ఆదుపులో  ఉండేలా చూసుకోండి. 
5. ఎక్కువ  కొలెస్ర్ట్రలు ఉండే  ఆహారాన్ని మానేయలి.

(   నేడు వరల్డ్ హార్ట్ డే ....)  

 మరిన్ని ..... డాక్టర్ గారిని కలిసి వారి సలహాలు సూచనలు పాటించండి.  



Wednesday, August 15, 2012

ఎందరో వీరుల త్యాగఫలం...


ఎందరో వీరుల త్యాగఫలం.....
ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని  రోజు.
స్వాతంత్ర్యం  సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం...


స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Tuesday, February 28, 2012

జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు ....

              చంద్రశేఖర్‌ వెంకట రామన్‌ (సి.వి.రామన్‌) ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జపుతారు. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, రువైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్‌ బహుమతి విజేతగా నిలిచారు. కేంద్రప్రభుత్వం భారతరత్న బహుకరించింది.


      మానవ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన వాటిలో శాస్త్ర సాంకేతిక రంగాలది ప్రథమస్థానం. సామాజిక జీవన ప్రమాణాల్ని, ఆర్థిక సంబంధాల్ని, సాంస్కృతిక నియమాల్నే గాక ప్రకృతి, భౌతిక ప్రపంచం గురించిన తాత్విక పరిజ్ఞానానికి శాస్త్రీయ పునాదిని కూడా శాస్త్ర సాంకేతిక రంగాలే సమకూర్చాయి.

             స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వయంపాలన, స్వయంప్రతిపత్తి వంటి వాదనలు బలపడుతున్న స్థితిలో ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆయుధ సంపత్తితో, పెద్దయెత్తున వినాశకర అణ్వాయుధాల తయారీకి, ఆధునిక రహస్య గూఢచర్యం కోసం వాడుతూ ఈ శక్తులు సౖన్సును దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ శాస్త్రసాంకేతిక సంపత్తిని గుప్పెట్లో పెట్టుకున్నాయి. సోషలిస్టు ఉత్పత్తి పద్ధతుల్ని దెబ్బతీసేందుకు ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అనే త్రిముఖ వ్యూహంతో ప్రపంచదేశాల్ని శాసించాలని, ప్రపంచ క్రమాన్ని, పాలనా పద్ధతుల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాయి.

                 విప్లవాత్మకమైన రీతిలో ఖగోళ పరిజ్ఞానం, జీవశాస్త్ర పరిజ్ఞానం, కంప్యూటర్‌ రంగం, పాదార్థిక విజ్ఞానం అభివృద్ధి చెందిన సమయం కూడా అదే! అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక రంగాలకున్న సహజ ప్రవృత్తి ప్రజల్ని మేల్కొలపడం, వారిలో ఆధునిక చైతన్యాన్ని తీసుకురావడం. మానవ చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రగతిశీల పాత్రను పోషించాయి. కానీ ప్రజల్ని అంధకారంలో ఉంచి పబ్బం గడుపుకొనే శక్తులకిది సమ్మతం కాదు.  పరమత ద్వేషం, అశాస్త్రీయత, మూఢనమ్మకాలు, స్వోత్కర్ష, కుహనా శాస్త్రమనే పునాదుల మీదే మతశక్తులు మనగగలవు.

           ప్రజల దైనందిన అవసరాల ప్రాముఖ్యత కన్నా విలాస వస్తువుల తయారీ, వినియోగతత్వాన్ని పోషించే ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ ప్రధాన రంగాలయ్యాయి. వ్యవసాయం, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణంలో కూడా ఆటోమేషన్‌ రావడంతో ప్రకృతి వనరులు హరించుకుపోతున్నాయి. జీవ సమతుల్యం, వనరుల సమతుల్యం దెబ్బతినడంతో పాటు, పర్యావరణ కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. నూతన ఆర్థిక పారిశ్రామికీకరణ పద్ధతులు అమల్లోకి వచ్చాక ఆబగా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడంతో పాటు శత్రు వినాశనానికి వీలు కల్పించే రసాయనిక, క్రిమి ఆయుధాల తయారీ పరాకాష్టకు చేరుకుంది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, ఎయిడ్స్‌ వ్యాధి వంటివి యుద్ధోన్మాదుల ప్రాయోజిత ప్రయోగాల ఫలితాలేనని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి.

            అటువంటి సంధి దశలో ప్రజలపక్షాన నిలిచే అభ్యుదయశక్తులు, ప్రభుత్వేతర సంస్థలు ఐక్యమై బలమైన ప్రజాసైన్సు ఉద్యమాన్ని చేపట్టవలసిన చారిత్రిక అవసరమేర్పడింది. ప్రజల్లో అశాస్త్రీయపుటంధకారం నుంచి వైజ్ఞానిక వెలుగువైపు నడిపించేందుకు, శాస్త్ర సాంకేతిక రంగాల్ని ప్రజాబాహుళ్యపు సమిష్టి ప్రయోజనాలకు సాధనాలుగా మార్చే ప్రక్రియకు బలాన్ని జోడించేందుకు ప్రజాసైన్స్‌ ఉద్యమ అవసరం ఏర్పడింది. ఆ స్ఫూర్తితో 1988 ఫిబ్రవరి 28న పురుడుపోసుకున్న 'జనవిజ్ఞాన వేదిక' కూడా తన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టి, రజతోత్సవం జరుపుకుంటున్నది.

Tuesday, February 21, 2012

దేశభాషలందు తెలుగు లెస్స...

                           అందరికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...

భాషలన్నింటిలో మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.శిశువు మొట్టమొదట నేర్చుకునే భాషే తల్లిబాష. శిశువు సహజరీతిలో నేర్చుకొనే భాష 'మాతృభాష'. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతీయ భాష మాతృభాష అవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగును దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు.


              భారత రాజ్యాంగంలోని 345 అధికరణం ప్రకారం ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమిచ్చింది. 1966లో ఆంధ్రప్రదేశ్‌ శాసనవిభాగం అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది. త్రిభాషా సూత్రాన్ని కూడా ప్రతిపాదించారు. మాతృభాష తెలుగును ప్రథమ, జాతీయ బాష హిందిని ద్వితీయ, ఆంగ్లబాషను తృతీయ భాషలుగా ప్రతిపాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్‌ తరగతులకు తెలుగును బోధ భాషగా ప్రవేశపెట్టింది. 1971లో డిగ్రీ కళాశాల జరగాలని నిర్ణయించారు.

నేడు  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా. (ఫిబ్రవరి 21)

Monday, January 16, 2012

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

 తెలుగు బ్లాగుల దినోత్సవం - డిసెంబర్ రెండవ ఆదివారం

Sunday, January 1, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

          మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...2012.
               ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి. 
మనిషిగా జీవితంలో ఎదిగేందుకు., వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు., పదుగురికీ సాయపడే బుద్దిని అలవరచుకునేందుకు., చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను పంచేందుకు ఈ నూతన సంవత్సరం  సకల జనావళికి దోహదపడాలని., ప్రతి ఒక్కరి కలలు ఫలించి ఈ ఏడాది శుభప్రదం కావాలని కోరుకుంటూ .....   

Sunday, December 11, 2011

మిత్రులకు, బంధువులకు తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు ....

హాలో ఫ్రెండ్‌..
తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు ....
ఈ బీజి ప్రపంచంలో ఏవరి పని వారికి. ఏవరి బీజి వారికి ఉంటుంది. తెలుగు వారి కోసం పది నిముషాలు కెటాయిస్తే మనకు తెలిసి ఒక మంచి విషయాన్ని పది మందికి తెలియజేసిన వారిగా, వారికి సహాయాన్ని, సహకారాన్ని అందిందిచన వారం అవుతాం. నేటికి తెలుగులో దాదాపు 4500 బ్లాగులు మాత్రమే ప్రపంచంలో వున్నాయని తెలుసు. అంటే దీనిని బట్టి తెలుగు పరిస్థితి అర్ధం అవుతుంది. నేను చిన్న ప్రయత్నంగా మిత్రులకు, బంధువులకు తెలియజేసి, ప్రోత్సహించి కొన్ని బ్లాగులను ప్రారంభింపజేశాను.
మనం మన వంతుగా కృషిగా విలైనపుడు మాతృభాష అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వ్యాప్తికి కృషి చేద్దాం...

మరో సారి తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలతో   ....

( నేడు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా...)