Monday, January 14, 2013
Tuesday, December 25, 2012
Tuesday, October 23, 2012
Tuesday, October 9, 2012
ప్రపంచ యువత ఆయనే బొమ్మ రూపంలో తలచుకుంటుంది...
యువత ధరిస్తున్న టీ షర్ట్స్‌పై ఎక్కువగా దర్శనమిస్తుంది ఒక బొమ్మ. మోటార్ వాహనాలు, సెల్‌ఫోన్స్, ఆఖరికి సినిమాల్లోనూ ఆ ప్రతి రూపాన్ని పెట్టటం కోసం యువత ఇష్టపడుతుంది. ఎక్కువ మంది యువతకు ఆ వ్యక్తి జీవితం తెలియకుండానే. ఆయన చనిపోయి 45 సంవత్సరాలు గడుస్తున్నా తెలిసో తెలియకో ఆ పేరు, ఆ రూపాన్ని ప్రపంచ యువత మరోరూపంలో తలచుకుంటుంది. ఆయనెవరో కాదు, నిత్య నూతన విప్లవ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఎర్నెస్టో చేగువేరా.
1928, జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు.
వైద్య విద్యనభ్యసించి చదువు పూర్తికాగానే అర్జెంటీనాలో 2,800 మైళ్ళు ప్రయాణం చేశాడు. తన మిత్రుడితో కలిసి ఒక పాత మోటార్‌సైకిల్‌పై లాటిన్ అమెరికా దేశాలన్నీ చుట్టొచ్చాడు. నియంతల పాలనలో మగ్గిపోతూ, పేదరికంతో అల్లాడిపోతున్న అభాగ్యుల జీవితాలను చే కళ్ళారా చూసి చలించిపోయాడు. లాటిన్ అమెరికా పేదల జీవితాల్లో కొత్త సూర్యోదయాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. దోపిడీ శక్తులను అంతమొందించాలంటే సమసమజాన్ని స్థాపించటం ఒక్కటే మార్గమని 'చే' భావించాడు.
1955 జూలైలో ఇప్ప టి క్యూబా దేశాధినేత అప్పటి పోరాటయోధుడు ఫైడల్ కాస్ట్రోను కలుసుకున్నారు. ఆయనతో కలిసి క్యూబా విప్లవ పోరాటంలో చేరాడు. 1956 నవంబర్25 నుంచి, డిసెంబర్ 2 వరకు 'గ్రాన్‌మా' నౌకలో 82 మందితో బయలుదేరిన విప్లవ తిరుగుబాటు యాత్రలో కాస్ట్రోతో కలిసి క్యూబా విప్ల వం విజయవంతం కావటంలో కీలకపాత్ర వహించాడు. నిరంతర విప్లవకారుడైన 'చే', క్యూబాలో విజయం లభిస్తే తాను మరో లాటిన్ అమెరికా దేశంలో విప్లవం నిర్మించటానికి వెళతానని అలా అయితేనే నీతో కలిసి వస్తానని, 1955 లో కాస్ట్రో నుంచి మాట తీసుకున్నాడు. ఆ మాట ప్రకారం లాటిన్ అమెరికాపై ఎర్ర బావుటా ఎగరేసేందుకు క్యూబాలో అధికారాన్ని త్యజించి విప్లవ బాట పట్టాడు.
Saturday, September 29, 2012
మన గుండె. మన చేతుల్లో...

గుప్పెడంత గుండె మన ప్రాణానికి మూలం.
అది నిర్విరామంగా కొట్టుకుంటేనే మనకు జీవితం.
మానసిక, శారీరక సమస్యలకు గుండె ఆరోగ్యానికి సంబందం ఉంది.
మన అనందమయ జీవితానికి గండె ఆరోగ్యం ఎంతో ముఖ్యం.
మన జీవన విధానం లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దానిని అదుపులో పెట్టవచ్చు.
1. పొగ త్రాగటం మానండి. పొగాకు వాడే ఉత్పత్తులను వాడకండి.
2. ఆల్కహాల్ సేవించడం మానండి.
3. ప్రతి రోజు తప్పనిసరిగా 30 నిముషాలు వ్యాయామము(నడక, పరుగు...) చేయడం అలవాటు చేసుకోండి.
4. మధుమేహం, బరువు, రక్తపోటు ఆదుపులో ఉండేలా చూసుకోండి.
5. ఎక్కువ కొలెస్ర్ట్రలు ఉండే ఆహారాన్ని మానేయలి.
( నేడు వరల్డ్ హార్ట్ డే ....)
మరిన్ని ..... డాక్టర్ గారిని కలిసి వారి సలహాలు సూచనలు పాటించండి.
Thursday, September 27, 2012
పోరాట సంప్రదాయాలకో సంకేతం.యువతకు ఉత్తేజం. స్ఫూర్తి. ఆదర్శం ...
షహీద్ భగత్‌సింగ్ పేరే యువతకు ఉత్తేజం.
ఆయన స్ఫూర్తి.
పోరాట సంప్రదాయాలకో సంకేతం.
త్యాగం ఆదర్శానికి నిదర్శనం.
ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.
నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయస్సులో ఉరికంబాన్ని చిరునవ్వుతో ముద్దాడిన యువ కిశోరాన్ని స్మరించుకోవాల్సిన అవసరముంది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డిఐలను అనుమతించడం, దేశంలో విద్య వ్యాపారీకరణకు విదేశీ వర్శిటీలను స్వాగతించడం చూస్తుంటే... కేంద్ర, రాష్ట్ర పాలకులు సామ్రాజ్యవాదులకు దాసోహమైనట్లు తేటతెల్లమవుతోంది. కావున విద్యార్థులు, యువకులు భగత్‌సింగ్‌ను స్మరించుకుంటూ సామ్రాజ్యవాద, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని నేడు భగత్‌సింగ్ 105వ జయంతి సందర్బంగా ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి.
Wednesday, August 15, 2012
Subscribe to:
Posts (Atom)





