Wednesday, August 15, 2012
Saturday, August 4, 2012
హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు క్యాంస్యం
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు క్యాంస్యం లభించింది. మూడో స్థానంకోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి వాంగ్‌పై సైనా విజయం సాధించింది.
భాగ్యనగరానికి మరో కీర్తి...
హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు శుభాకాంక్షలు. మన క్రీడాకారులు మరిన్ని పతకాలు తేస్తారని అశిస్తూ...
Tuesday, July 31, 2012
Sunday, July 22, 2012
Friday, June 22, 2012
వేడి వేడిగా చల్లచల్లగా...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్టణం , సింహాచలం, ఆరకు లోయ, బొర్రా గుహలు, తిరుపతి, శ్రీకాళహస్తి, తమిలనాడు రాష్ట్రం వెల్లుర్ పట్టణంలోని గొల్డెన్ టెంఫుల్ ... మే 28 నుండి జున్ 3 వరకు ముడు స్నేహితుల కుటుంబలతో వెల్లివచ్చాం. విశాఖపట్టణంలొ, గొల్డెన్ టెంఫుల్ ల దారి లో వేడిని భారించలేకపోయాం. తిరుమల, బొర్రా గుహలు చాలా ఆసక్తికరముగా, ఆహ్లాదకరముగా చల్లచల్లగా ఉంది. పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు. మా టూర్ వేడి వేడిగా చల్లచల్లగా జరిగింది.
విశాఖపట్టణం లో చూడదగిన ప్రదేశాలు :
1. సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. 2. రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విశాలత తగ్గింది. కొద్దిగా కాలుష్యంగా ఉంది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే జలాంతర్గామి ( కల్వారి ) మ్యూజియం (భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు ) ఉన్నాయి. 3. కైలాసగిరి- శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి కొండమీద. 4. వైజాగ్ స్టీలు ప్లాంటు. చాలా పెద్దది. చూడటానికి కనిసం 8 గంటలు వాహనం ద్వార పడుతుంది. 5. రిషికొంద బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో వున్నది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు. 6. భ్మిలీ బీచ్ - నగరానికి 28కి.మీ దూరంలో వున్నది. తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు. 7. జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు 8.విశాఖ నౌకాశ్రయము, విశాఖపట్నం చేపలరేవు 9.ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విద్యా కళా పరిషత్) 10. రామనాయుడు స్టూడియో సముద్ర తీరంలో కొండ మీద వుంది.
విశాఖపట్టణంలొ వేడిని భారించలేకపోయాం. దానితో రెండు రొజులు బీచ్ లలో ఎంజయ్ చేశాం. పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు.
అరకు : ఆరకు లోయ సముద్రమట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 115 కి.మి.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో , కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది. విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్ , ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు, వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లొ ఉదయం 6.50 కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి. అది అలా కొండలు , లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ఫ్రయాణం లొ "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది. అది భారతదేశంలొ అతి ఎత్తులొ వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు. ఇక వెళ్లే దారిలొ బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణం లో చూడవచ్చు. దారిలో అనంతగిరి కొండల లో కాఫీ తోటలు ఉన్నాయి. అరుకులొ వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు, ట్రైబల్ కాటేజీలు వుంటాయి .

Thursday, June 14, 2012
యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...
నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే రూపం.
నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి నేటికీ ఆదర్శం.
ప్రపంచంలో ఎకడచుసినా నీ రూపం...
ఏ కీ చైన్ చూసినా, టీ షార్ట్ చూసినా .....

మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...
నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...
చే గెవారా దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు

1950
వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో
ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు.
డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే'
గా పిలువబడ్డాడు. చే గెవారా అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా.
గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా
వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు.
ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.
ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా
ఎదురించడానికి సిద్దంగా ఉండు - చే

(నేడు చేగువేరా జయంతి)
Saturday, May 19, 2012
మహా మనిషి, ఆదర్శ జీవి...
ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత. దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు. సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.
కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. "కామ్రేడ్ పి.ఎస్." అని ఈయనను పిలిచేవారు. మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు. ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని ఆనాడే సుందరయ్య గారూ పిలుపునిచ్చారు.
సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు.
సుందరయ్య,

నీలాంటి త్యాగజీవులెందరయ్యా ,
Subscribe to:
Posts (Atom)